Pushpa 2 stampede: మాకు హీరోలు, పరిశ్రమ మీద కోపం లేదు.. మంత్రి శ్రీధర్‌బాబు కీలక వ్యాఖ్యలు

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ఘటనపై మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు.

Update: 2024-12-21 12:24 GMT

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: (Pushpa 2 stampede) సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ఘటనపై మంత్రి శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) స్పందించారు. శనివారం మీడియాతో చిట్‌చాట్‌లో మంత్రి మాట్లాడారు. మాకు కానీ, మా సీఎం కి కానీ ప్రభుత్వానికి కానీ ఎవ్వరి మీద కోపం లేదు.. అని స్పష్టం చేశారు. మానవతా దృక్పధంతో వ్యవహరించాల్సి ఉందన్నారు. తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోయినారని తెలిసి కూడా బాధ్యాతగా వ్యవహరించలేదని విమర్శించారు.

ఘటన జరిగిన తర్వాత బాధిత కుటుంబాన్ని పరామర్శించలేదని తెలిపారు. పోలీసులు హెచ్చరించే వరకు అల్లు అర్జున్ అక్కడ నుంచి వెళ్ళలేదన్నారు. వెళ్ళేటప్పుడు కూడా ఓపెన్ టాప్‌లో వెళ్లడం అభ్యంతరకరమన్నారు. మేము సినీ పరిశ్రమను కూడా కాపాడుకోవాలి.. శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానిదే కదా? మాకు హీరోల మీద, పరిశ్రమ మీద కోపం లేదు.. అని స్పష్టం చేశారు.


Also Read..

Pushpa 2 : తగ్గాల్సిందే పుష్పా..! 

Tags:    

Similar News