Kishan Reddy: ఈనెల 25న వాజ్ పేయి శత జయంతి.. నిర్వహణపై నేతలతో కిషన్ రెడ్డి చర్చ

భారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయ్(Atal Bihari Vajpayee) శత జయంతిని ఈనెల 25వ తేదీన బీజేపీ నిర్వహించనుంది.

Update: 2024-12-21 16:37 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : భారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయ్(Atal Bihari Vajpayee) శత జయంతిని ఈనెల 25వ తేదీన బీజేపీ నిర్వహించనుంది. కాగా దీనికి సంబంధించిన నిర్వహణపై నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం కేంద్ర మంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan Reddy) అధ్యక్షతన వివిధ మోర్చాల అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. కాగా ఈనెల 25న శత జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా బ్లడ్ డొనేషన్ క్యాంపులు, స్వచ్ఛ భారత్, జిల్లా కేంద్రాల్లో సమావేశాలు, మండలాల్లో ర్యాలీలు, బూత్ లెవల్లో శ్రద్ధాంజలి ఘటించాలని నిర్ణయం తీసుకున్నారు. కాగా ఈ జయంతిని ఏడాది పాటు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.

Tags:    

Similar News