Dundigal: నోటీసులతోనే సరి..! కబ్జాకోరల్లో దూలపల్లి లింగయ్య చెరువు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార ధ్యంలో చెరువులు, కుంటలు, కట్టు కాలువలు, నాళాల పరిరక్షణకు హైడ్రా రూపంలో పగడ్బందీ చర్యలు చేపడుతున్నా.. రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు, సిబ్బంది చేతివాటంతో అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్టపడడం లేదన్న విమర్శలు వెలువడుతున్నాయి.

Update: 2024-12-22 02:32 GMT

దిశ, దుండిగల్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార ధ్యంలో చెరువులు, కుంటలు, కట్టు కాలువలు, నాళాల పరిరక్షణకు హైడ్రా రూపంలో పగడ్బందీ చర్యలు చేపడుతున్నా.. రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు, సిబ్బంది చేతివాటంతో అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్టపడడం లేదన్న విమర్శలు వెలువడుతున్నాయి. దుండిగల్ గండి మైసమ్మ మండల పరిధి దూలపల్లి లింగయ్య చెరువు ఎప్‌టీఎల్, బఫర్ జోన్ లలో నిర్మాణాలు యథేచ్ఛగా సాగుతున్నా అధికారాలు పట్టించుకోవడం లేదంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను భేఖాతర్ చేస్తూ అక్రమ నిర్మాణాలు సాగుతుండడం ఆందోళన కలిగించే విషయం. నగర శివారు ప్రాంతాల్లో భూముల ధరలు ఆకాశాన్ని అంటుతుండడం, రియల్ ఎస్టేట్ వ్యాపారులు క్రమక్రమంగా చెరువులను, కుంటలను పూడుస్తూ అక్రమ దందాకు తెరలేపుతున్నారు. కాసులకు కక్కుర్తి పడుతున్న రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు కబ్జాదారులకు పరోక్షంగా సహకరిస్తుండడంతో చెరువులు, కుంటలు కనుమరుగవుతున్నాయి.

కుంచించుకుపోతున్న చెరువు..

దూలపల్లి సర్వే నెం. 21లోని లింగయ్య చెరువు విస్తీర్ణం 20 ఎకరాల 18 గుంటల 200 గజాలు ఇప్పటికే సుమారు 4 ఎకరాల బఫర్ జోన్ అన్యాక్రాంతం కాగా మరో ఎకరం భూమి కాజేసేందుకు కొందరు వ్యక్తులు స్కెచ్ వేశారా? ఈ క్రమంలో రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులను మచ్చిక చేసుకుంటూ వంద గజాలకు ఒక్కో ప్లాట్ విక్రయి స్తూ 20 నుంచి 25 లక్ష్యాలను అమ్ముతున్నట్లు సమాచారం, బఫర్ జోన్, ఎఫ్‌టీఎల్ జరుగుతున్న నిర్మాణాలను రెవెన్యూ ఇరిగేషన్ జాయింట్ యాక్షన్ నిర్వ హించి లింగయ్య చెరువులో జరుగుతున్న కబ్జాలను అడ్డుకొని చెరువును రక్షించాలని ప్రజలు కోరుతున్నారు.

చర్యలకు వెనకడుగు..

వార్తా కథనాలతో స్పందించిన ఇరిగేషన్ అధికారులు లింగయ్య చెరువు కబ్జాలను గుర్తించి రెవె న్యూ అధికారులకు నోటీసులు అందజేశారు, నోటీసులు అందజేసి నెల గడుస్తున్నా నేటికీ రెవెన్యూ అధికారులు చర్యలకు వెనకడుగు వేస్తుండడం అనుమానాలకు తావిస్తోంది, కబ్జాదారులతో రెవెన్యూ అధికారులు ములాకత్ అయినట్టు వినికిడి. ఏది ఏమైనా లింగయ్య చెరువును కబ్జాల నుంచి కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.

Tags:    

Similar News