ఓల్డ్ బోయినపల్లిలో యువకుని దారుణ హత్య..

సికింద్రాబాద్ ఓల్డ్ బోయినపల్లి అలీ కాంప్లెక్స్ సమీపంలోని హర్షవర్ధన్ కాలనీ వద్ద శనివారం రాత్రి సమీర్ (20) అనే యువకుడిని ముసుగులు ధరించిన ముగ్గురు వ్యక్తులు కత్తులు,బ్లేడ్ లతో విచక్షణా రహితంగా దాడి చేసి అందరు చూస్తుండగానే అత్యంత కిరాతకంగా హత్య చేసినట్లు స్థానికులు తెలిపారు.

Update: 2024-12-22 01:53 GMT

దిశ, తిరుమలగిరి : సికింద్రాబాద్ ఓల్డ్ బోయినపల్లి అలీ కాంప్లెక్స్ సమీపంలోని హర్షవర్ధన్ కాలనీ వద్ద శనివారం రాత్రి సమీర్ (20) అనే యువకుడిని ముసుగులు ధరించిన ముగ్గురు వ్యక్తులు కత్తులు,బ్లేడ్ లతో విచక్షణా రహితంగా దాడి చేసి అందరు చూస్తుండగానే అత్యంత కిరాతకంగా హత్య చేసినట్లు స్థానికులు తెలిపారు. స్థానికులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మృతుడు 9 నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారని, ఆ ప్రేమ వివాహం నచ్చని అమ్మాయి తరఫున వారే ఈ హత్యకు పాల్పడినట్లు స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

కాగా సమీర్ ను హత్య చేయడానికి హంతకులు గత కొద్ది రోజులుగా బస్తీలో రెక్కి నిర్వహించిన తర్వాతనే ఈ హత్యకు పాల్పడినట్లు స్థానిక పోలీసులు ప్రాథమిక అంచనా వేశారు. యువకుని పై దాడికి పాల్పడుతున్న సమయంలో అక్కడే ఉన్న స్థానిక యువకుడు, మరికొందరు వారిని వారించే ప్రయత్నం చేయగా అందరిని కత్తులతో బెదిరించినట్లు స్థానికులు తెలిపారు. ఘటనా స్థలాన్ని డీసీపీ రష్మీ పెరుమాల్, బేగంపేట ఎసీపీ గోపాలకృష్ణ, బోయినపల్లి ఇన్ స్పెక్టర్ లక్ష్మీనారాయణ రెడ్డి, డీఐ సర్దార్ నాయక్, ఎస్ఐ నాగేంద్రబాబు, క్లూస్ టీం బృందం సంఘటనా స్థలాన్ని పరిశీలించి పూర్తి వివరాలు సేకరించారు.


Similar News