ప్రేమ వివాహం.. యువకుడి దారుణ హత్య
ప్రేమ వివాహం చేసుకున్నాడనే నెపంతో ఓ యువకుడిని దారుణంగా హత్య చేశారు. కొద్ది రోజుల క్రితం సమీర్ అనే యువకుడు ప్రేమ వివాహం చేసుకున్నాడు.
దిశ, వెబ్ డెస్క్: ప్రేమ వివాహం చేసుకున్నాడనే నెపంతో ఓ యువకుడిని దారుణంగా హత్య(Brutal murder) చేశారు. కొద్ది రోజుల క్రితం సమీర్ అనే యువకుడు ప్రేమ వివాహం(love marriage) చేసుకున్నాడు. కాగా అతను శనివారం అర్ధరాత్రి హైదరాబాద్-బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్(Boinpally Police Station) పరిధిలోని ఓ ప్రాంతంలో తన స్నేహితుడితో కలిసి వెళ్తున్నాడు. ఈ క్రమంలో వారిని వెంబడిస్తూ వచ్చిన ఐదుగురు నిందితులు.. ఇద్దరిపై దాడి చేశారు. అనంతరం సమీర్ ను కత్తులతో అతి కిరాతంగా పొడిచి హత్య చేశారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని అక్కడే ఉన్న మరో యువకుడు పోలీసులకు అందించాడు. ఈ సందర్భంగా ఆ యువకుడు మాట్లాడుతూ.. సమీర్ ప్రేమ వివాహం చేసుకున్నందుకే హత్య చేసినట్లు తెలిపాడు. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా యువకుడిని హత్య చేసిన నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు.