Mumbai : నాలుగేళ్ల బాలుడిపై నుంచి దూసుకెళ్లిన కారు.. కారు డ్రైవర్ ఒక టీనేజర్
దిశ, నేషనల్ బ్యూరో : ముంబై(Mumbai)లో ఘోర ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొని అభంశుభం ఎరుగని నాలుగేళ్ల బాలుడు మృతిచెందాడు.
దిశ, నేషనల్ బ్యూరో : ముంబై(Mumbai)లో ఘోర ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొని అభంశుభం ఎరుగని నాలుగేళ్ల బాలుడు మృతిచెందాడు. ఆ కారును 19 ఏళ్ల యువకుడు డ్రైవ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. నగరంలోని వడాలా ప్రాంతంలో నాలుగేళ్ల బాలుడు రోడ్డుపై ఆడుకుంటుండగా.. అతడిపై నుంచి కారు దూసుకెళ్లిందని పోలీసులు తెలిపారు. కారు నడిపిన టీనేజర్(teen driver)ను భూషణ్ గోలేగా గుర్తించామన్నారు.
అతడు తన హ్యూందాయ్ క్రెటా కారును రివర్స్ చేస్తుండగా ఈ దారుణ ఘటన చోటుచేసుకుందని చెప్పారు. బాలుడిపై నుంచి కారు దూసుకెళ్లిందని గుర్తించిన వెంటనే టీనేజర్ అక్కడే ఆగిపోయాడు. అక్కడికి చేరుకున్న పోలీసులు నిందితుడు భూషణ్ గోలేను అరెస్టు చేశారు. కారును నడిపిన టైంలో అతడు మద్యం మత్తులో లేడని పోలీసు అధికారి ఒకరు చెప్పారు. నిందితుడిపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)లోని పలు సెక్షన్ల కింద కేసును నమోదు చేశారు. చనిపోయిన బాలుడి ఫ్యామిలీ వడాలా ప్రాంతంలో ఫుట్‌పాత్‌పై నివసిస్తోంది. బాలుడి తండ్రి కార్మికుడు.