Uttar Pradesh: ఇద్దరి ప్రాణం తీసిన మస్కిటో స్టిక్స్

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌(Ghaziabad)లో మస్కిటో స్టిక్స్(Mosquito Repellent Sticks) ఇద్దరి ప్రాణాలు తీసింది. దోమల నివారణ కోసం మస్కిటో స్టిక్స్ అంటించగా.. దాని వల్ల మంటలు చెలరేగడంతో ఇద్దరు వ్యక్తులు మరణించారు.

Update: 2024-12-22 11:21 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌(Ghaziabad)లో మస్కిటో స్టిక్స్(Mosquito Repellent Sticks) ఇద్దరి ప్రాణాలు తీసింది. దోమల నివారణ కోసం మస్కిటో స్టిక్స్ అంటించగా.. దాని వల్ల మంటలు చెలరేగడంతో ఇద్దరు వ్యక్తులు మరణించారు. దీంతో, కుటుంబంలోని ఇద్దరు చనిపోయారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఘజియాబాద్ లోని ప్రశాంతి విహార్ ప్రాంతంలో నీరజ్ కుటుంబం నివసిస్తుంది. కాగా.. అతని కుమారులు అరుణ్‌, వన్ష్ లు తమ గదిలో మస్కిటో కాయిల్ ని వెలిగించారు. అర్ధరాత్రి తర్వాత తమ గదిలో దోమల నివారణ కర్రలను వెలిగించి నిద్రపోయారు. ఆ తర్వాత వారి తండ్రి నీరజ్ తన పిల్లల గదిలో నుండి పెద్ద ఎత్తున పొగ, మంటలు రావడంతో నిద్రలేచారు. వారిని రక్షించడానికి వెళ్లగా.. వన్ష్ అప్పటికే చనిపోయాడు. అరుణ్ ని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ చనిపోయాడు. ఘటన జరిగినప్పుడు బాధితుల తల్లిదండ్రులు మరో గదిలో నిద్రిస్తున్నారని అధికారులు తెలిపారు.

కరెంట్ లేక..

మృతుల తండ్రి తెలిపిన వివరాల ప్రకారం విద్యుత్ తీగల మరమ్మతులతో ఆ ప్రాంతంలో కరెంటు లేదని పోలీసులు పేర్కొన్నారు. అయితే, దోమల బెడదతో మస్కిటో స్టిక్ అంటించారని పేర్కొన్నారు. బెడ్ పైన కొన్ని బట్టలు ఉన్నాయని.. దీంతో, మంటలు చెలరేగి ప్రమాదం జరిగి ఉండొచ్చన్నారు. అయితే, డెడ్ బాడీలను పోస్టుమార్టం నిమిత్తం పంపించినట్లు పోలీసులు పేర్కొన్నారు. కాలిన గాయాలతో చనిపోయారా లేదా పొగ పీల్చడం వల్లే చనిపోయారా అనేది తెలియాల్సి ఉందన్నారు.

Tags:    

Similar News