ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య
ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది.
దిశ,డోర్నకల్(సీరోలు): ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. సిరోల్ సబ్ ఇన్స్పెక్టర్ నగేష్ కథనం ప్రకారం.. సక్రం నాయక్ తండాకు చెందిన తేజవత్ శ్రీను(38) కుటుంబ వ్యవసాయం నిమిత్తం అప్పుల పాలై పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.