హెచ్.పీ గోదాంలో భారీ పేలుడు.. వ్యక్తి మృతి..

నారాయణపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలో ఉన్న హెచ్పీ గ్యాస్ గోదాంలో ఆదివారం తెల్లవారుజామున 12:30 గంటల ప్రాంతంలో సిలిండర్ పేలిన ఘటనలో నరేష్ (24) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి.

Update: 2024-12-22 05:42 GMT

దిశ, మద్దూరు : నారాయణపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలో ఉన్న హెచ్పీ గ్యాస్ గోదాంలో ఆదివారం తెల్లవారుజామున 12:30 గంటల ప్రాంతంలో సిలిండర్ పేలిన ఘటనలో నరేష్ (24) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకెళితే గుండుమల్ మండల కేంద్రానికి చెందిన నరేష్, కృష్ణ, కోయిలకొండ మండలం అభంగపట్నంకు చెందిన నవీన్ గత కొంతకాలంగా గ్యాస్ కంపెనీలో ఆయా విభాగాల్లో పనిచేస్తున్నారు.

ఆదివారం రాత్రి కంపెనీలో ఉండగా ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలుపుతున్నారు. గ్యాస్ సిలిండర్లను రీ ఫిల్లింగ్ చేసే క్రమంలోనే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. ఉదయం సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తుండగా.. ప్రమాదానికి గల కారణాల పై ఎన్ఫోర్స్మెంట్ డీటీ విచారణ జరుపుతున్నారు.


Similar News