మూడేండ్ల బాలుడి పై వీధి కుక్కల దాడి..

నిర్మల్ జిల్లా భైంసా మండలం దేగం గ్రామ సమీపంలో గల ఇటుక బట్టీ వద్ద ఓ బాలుడి పై కుక్కలు దాడి చేసిన ఘటన ఆదివారం ఉదయం చోటు చేసుకుంది.

Update: 2024-12-22 04:30 GMT

దిశ, భైంసా : నిర్మల్ జిల్లా భైంసా మండలం దేగం గ్రామ సమీపంలో గల ఇటుక బట్టీ వద్ద ఓ బాలుడి పై కుక్కలు దాడి చేసిన ఘటన ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం తెల్గా తరోడకి చెందిన గఫర్ కుటుంబంతో కలిసి దెగం సమీపంలో గల ఇటుకబట్టిలో పని నిమిత్తం వచ్చాడు. అక్కడే తన మూడు సంవత్సరాల కుమారుడు అబ్దుల్ అమీర్ ఆడుకుంటూ ఉన్నాడు. ఈ క్రమంలోనే పక్కన వున్న కుక్కలు బాలుడి పై దాడి చేశాయి. అది గమనించి వారు బాలున్ని భైంసా ఏరియా ఆస్పత్రికి తీసుకువచ్చమని తెలిపారు. తీవ్ర గాయాలతో వున్న బాలునికి ప్రస్తుతం వైద్యం అందిస్తున్నారు.


Similar News