Fire Accident: రాష్ట్రంలో భారీ అగ్ని ప్రమాదం.. రూ.2.50 కోట్ల ఆస్తి నష్టం

భారీ అగ్ని ప్రమాదం (Fire Accident) సంభవించిన ఘటన శ్రీకాకుళం (Srikakulam) జిల్లాలోని ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.

Update: 2024-12-22 08:51 GMT

దిశ, వెబ్‌డెస్క్: భారీ అగ్ని ప్రమాదం (Fire Accident) సంభవించిన ఘటన శ్రీకాకుళం (Srikakulam) జిల్లాలోని ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మందస (Mandasa) మండల పరిధిలోని హరిపురం (Haripuram)శివారులో ఉన్న ఓ జీడి పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ప్రమాదం రాత్రి వేళ జరగడంతో పరిశ్రమ నలువైపులా మంటలు వేగంగా వ్యాపించాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది ఫైరింజన్‌తో ఎగసిపడుతోన్న మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. షార్ట్‌ సర్క్యూట్ (Short Circuit) కారణంగానే ప్రమాదం జరిగినట్లుగా వారు ప్రాథమికంగా వెల్లడించారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.2.50 కోట్ల విలువైన జీడిపప్పు దగ్ధమైనట్లుగా తెలుస్తోంది. కల్లెదుటే పరిశ్రమ మంటల్లో బూడిదవడంతో యజమాని కంటతడి పెట్టాడు. తమను ఆదుకోవాలంటూ ప్రభుత్వాన్ని వేడుకున్నాడు.  

Tags:    

Similar News