లాడ్జ్ లో ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య
భద్రాచలం పట్టణంలోని చప్పిడి దిగువ ప్రాంతంలో ఉన్న ఓ లాడ్జిలో పాల్వంచకు చెందిన వీరస్వామి అనే వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
దిశ, భద్రాచలం : భద్రాచలం పట్టణంలోని చప్పిడి దిగువ ప్రాంతంలో ఉన్న ఓ లాడ్జిలో పాల్వంచకు చెందిన వీరస్వామి అనే వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వీరస్వామిది పాల్వంచలోని వికలాంగుల కాలనీ కాగా అతను కార్ డ్రైవర్ అని తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.