యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో అడ్మిషన్లు ప్రారంభం

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో అడ్మిషన్లు ప్రారంభమైనట్టు వైస్ ఛాన్సలర్ వి.ఎల్.వి.ఎస్.ఎస్. సుబ్బారావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Update: 2024-12-21 16:30 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో అడ్మిషన్లు ప్రారంభమైనట్టు వైస్ ఛాన్సలర్ వి.ఎల్.వి.ఎస్.ఎస్. సుబ్బారావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ఔత్సాహిక యువతి, యువకులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇప్పటికే ఈ కింద పేర్కొన్న కోర్సులకు నోటిఫికేషన్ విడుదల చేశామని తెలిపారు. లాజిస్టిక్ ఎక్జ్యూటివ్, ట్రాన్స్ పోర్టు ఎక్జ్యూటివ్ నవత లాజిస్టిక్స్, సప్లై ఎసెన్షియల్ ప్రొఫెషనల్ సర్టిఫికేషన్ ప్రోగ్రాం, ఈక్యూయూఐపీపీ బ్యాంకింగ్, ఫైనాన్షియల్, ఇన్సూరెన్స్ సర్వీస్, లెన్స్ కార్ట్ స్టోర్ అసోసియేట్, డాక్టర్ రెడ్డిస్ ఫార్మా టెక్నికల్ ప్రోగ్రాం కోర్సులకు అడ్మిషన్లు జరుగుతున్నాయని, ఔత్సాహిక యువతీ, యువకులు పూర్తి వివరాల కోసం https://yisu.in వెబ్ సైట్ కులాగిన్ కావాలని సూచించారు. ఆయా కోర్సులను అనుసరించి రుసుము ఉంటుందని వెల్లడించారు.


Similar News