మారని తీరు.. చౌడాపూర్ జెడ్పీహెచ్ఎస్‌లో పురుగుల అన్నం

ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థులకు వడ్డించడంలో అధికారులు విఫలమవుతూనే ఉన్నారు.

Update: 2024-12-21 11:33 GMT

దిశ, కుల్కచర్ల : ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థులకు వడ్డించడంలో అధికారులు విఫలమవుతూనే ఉన్నారు. శనివారం చౌడాపూర్ మండలకేంద్రం లోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలోవిద్యార్థులకు నాణ్యమైన భోజనం కాకుండా పురుగుల అన్నాన్ని వడ్డించారు.చాలా చోట్ల తరుచు ఇలాంటి ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం చర్యలు తీసుకుంటామని చెబుతున్న ఆచరణలో అమలు కావడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పటికైనా ఉన్నత అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తూ నాణ్యమైన భోజనాన్ని అందించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.


Similar News