అనుమతుల్లేని నిర్మాణాలను సీజ్ చేసిన మున్సిపల్ అధికారులు
అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడితే చర్యలు తీసుకుంటామని మున్సిపల్ అధికారులు హెచ్చరించారు.
దిశ, అబ్దుల్లాపూర్మెట్ : అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడితే చర్యలు తీసుకుంటామని మున్సిపల్ అధికారులు హెచ్చరించారు. ఈ మేరకు శనివారం మున్సిపాలిటీ పరిధిలోని పలు అనుమతులు లేని అక్రమ నిర్మాణాలను సీజ్ చేశారు. అదే విధంగా పలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ప్రహరీ గోడలను తొలగించారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... పెద్ద అంబర్పేట పరిధిలోని సర్వే నెంబర్ 230, 231లో అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టిన శ్యాంసుందర్ రెడ్డికి చెందిన గోదాము, అదేవిధంగా శ్రీనివాసరావుకు చెందిన మరో షెడ్ ను, కుంట్లూరు పరిధిలోని సర్వే నెంబర్ 240 లో గల బద్దం జంగారెడ్డి, షెడ్ లను, గౌరెల్లికి చెందిన సర్వే నెంబర్ 191 లో గల కు పురం స్వర్ణలత కు చెందిన బిల్లింగ్ లను సీజ్ చేశారు. అదేవిధంగా పెద్ద అంబర్పేట సర్వే నెంబర్ 177, 178,179 లోపల నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన ప్రహరీ గోడ నిర్మాణాలను తొలగించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.