హనుమంతుని విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులు
హనుమంతుని విగ్రహం తో పాటు పూజ సామగ్రిని గుర్తు తెలియని
దిశ, మొయినాబాద్ : హనుమంతుని విగ్రహం తో పాటు పూజ సామగ్రిని గుర్తు తెలియని దుండగులు శుక్రవారం రాత్రి ధ్వంసం చేసిన సంఘటన మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం మొయినాబాద్ మండలం తోల్కట్ట రెవెన్యూ పరిధిలో శుక్రవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు హనుమాన్ విగ్రహాన్ని ధ్వంసం చేయడంతో పాటు పూజా సామాగ్రిని ధ్వంసం చేశారు. దీంతో గ్రామంలో పెద్ద ఎత్తున ప్రజలు ధర్నా నిర్వహించారు. సమాచారం అందుకున్న మొయినాబాద్ పోలీసులు గ్రామానికి చేరుకొని సంఘటనకు బాధ్యులైన వారిని పట్టుకొని చర్యలు తీసుకుంటామని వారిపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు.
హైదరాబాద్ బీజాపూర్ రహదారిపై రాస్తారోకో..
మొయినాబాద్ మండలం తోల్కట్ట గ్రామ పరిధిలో హనుమాన్ దేవాలయంలో విగ్రహాలను ధ్వంసం చేసిన సమాచారం తెలుసుకున్న గ్రామస్తులు పెద్ద ఎత్తున బీజాపూర్ రహదారిపై రాస్తారోకో ధర్నా చేయడం తో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు గట్టి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.
తోల్కట్ట గ్రామాన్ని సందర్శించిన చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు..
చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి శనివారం తోల్కట్ట గ్రామాన్ని సందర్శించారు. తోలు కట్ట గ్రామంలో హనుమాన్ దేవాలయం ధ్వంసం కావడం సమాచారం అందుకున్న వెంటనే గ్రామాన్ని సందర్శించారు. జరిగిన సంఘటన గురించి అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో అక్కడక్కడ తరచూ ఇలాంటి సంఘటన జరుగుతున్నప్పటికీ దేవాలయాల వద్ద పోలీసులు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా సీసీ కెమెరాల ఏర్పాటు తదితర చర్యలు చేపట్టకపోవడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు కొండ విచ్చేసి రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట హిందూ దేవుళ్లపై ఇలాంటి సంఘటన జరుగుతున్న పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరం నడిబొడ్డున కూడా ఇలాంటి సంఘటననే జరిగినప్పటికీ పోలీసులు ఎందుకు ముందస్తు చర్యలు తీసుకోలేదని ఆయన మండిపడ్డారు. మొయినాబాద్ మండలం లో ఇలాంటి సంఘటన మొదటిసారి కావచ్చు కానీ రాష్ట్రంలో ఇంతకుముందే ఇలాంటి సంఘటన జరిగినప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.