‘నిమ్స్’ కోసం కొత్త బిల్డింగ్.. ఆ శాఖ ఫోకస్ అంతా అక్కడే!

నిమ్స్‌ ఆస్పత్రి కొత్త బిల్డింగ్ నిర్మాణంపై ఆర్‌అండ్‌బీ శాఖ ఉన్నతాధికారులు ఫోకస్ పెట్టారు.

Update: 2024-10-08 02:12 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: నిమ్స్‌ ఆస్పత్రి కొత్త బిల్డింగ్ నిర్మాణంపై ఆర్‌అండ్‌బీ శాఖ ఉన్నతాధికారులు ఫోకస్ పెట్టారు. ఇప్పటికే పనులు వేగంగా సాగుతున్నాయి. పనుల్లో మరింత వేగం పెంచేందుకు రోడ్లు, భవనాల శాఖకు చెందిన ఉన్నతాధికారులు, వైద్య ఆరోగ్య శాఖ ఆఫీసర్లు తరచూ సమావేశం అవుతున్నారు. నిర్దిష్ట గడువులోగా వర్క్ పూర్తి చేయాలని అధికారులు టార్గెట్‌గా పెట్టుకున్నారు. మొత్తం 33 ఎకరాల్లో నిమ్స్‌ విస్తరణ పనులు జరుగుతున్నాయి. 2002 పడకల సామర్ధ్యంతో కొత్తగా మూడు బ్లాకులు నిర్మిస్తున్నారు.

ఓపీ, ఐపీ, ఎమర్జెన్సీ సేవలకు ప్రత్యేకంగా బ్లాక్‌లు ఏర్పాటు చేస్తున్నారు. ఎమర్జెన్సీ విభాగ సేవల కోసం ప్రత్యేకంగా 8 అంతస్తులతో బ్లాక్‌ను నిర్మిస్తున్నారు. ఇన్‌పేషంట్ల కోసం 13 అంతస్తులతో మరో బ్లాక్‌ కడుతున్నారు. కొత్త బిల్డింగ్‌లో 30 ఆపరేషన్‌ థియేటర్లు ఉంటాయి. 2,002 పడకలు అందుబాటులోకి రానున్నాయి. అన్నింటికీ ఆక్సిజన్‌ సరఫరా ఉండే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 2002 ఆక్సిజన్‌ బెడ్లు, 440 ఐసీయూ బెడ్లు ఉంటాయి. ప్రస్తుతం నిమ్స్‌లో 30కి పైగా రకరకాల వైద్య సేవలు అందిస్తుండగా.. విస్తరణతో వీటి సంఖ్య 35కు పెంచేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు.


Similar News