పోలీసుల అడ్డుకున్నందుకే రోడ్డుపై బైఠాయించి నిరసన: సీఎం రేవంత్ రెడ్డి
టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన చలో రాజ్ భవన్(Chalo Raj Bhavan) కార్యక్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka)తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
దిశ, వెబ్ డెస్క్: టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన చలో రాజ్ భవన్(Chalo Raj Bhavan) కార్యక్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka)తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నెక్లెస్ రోడ్డు నుంచి కాలినడకన రాజ్ భవన్ వద్దకు కాంగ్రెస్ నేతలు చేరుకున్నారు. ఈ క్రమంలో రోడ్డుపై బైటాయించిన కాంగ్రెస్ నేతలు.. అదానీ, మణిపూర్ ఘటనలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పార్లమెంట్ లో ఈ అంశాలపై చర్చించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాజ్ భవన్ ముట్టడి(Siege of Raj Bhavan)కి వెళ్తున్న మతను హైదరాబాద్ పోలీసులు కూతవేటు దూరంలో అడ్డుకున్నారని.. ఈ క్రమంలోనే రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్నామని సీఎం చెప్పుకొచ్చారు. ప్రభుత్వంలో ఉండి తాము చేస్తున్న ఈ నిరసన కొంత మందికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చని అన్నారు. అలాగే పార్లమెంట్‌లో అదానీ వ్యవహారంపై జేపీసీ వేయాలని.. అలా చేస్తూ అదానీ కచ్చితంగా జైలుకు వెళ్తారని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. అలాగే అదానీ వ్యవహారంపై తెలంగాణ అసెంబ్లీలో చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని.. సభలో అదానీ అంశంపై తీర్మానం చేసి పార్లమెంటుకు పంపుదామని.. ఈ సందర్భంగా సీఎం చెప్పుకొచ్చారు.