CM Revanth Reddy : అదానీ స్కామ్.. జేపీసీ విచారణపై కేసీఆర్ వైఖరి చెప్పాలి : సీఎం రేవంత్ రెడ్డి

అదానీ స్కామ్(Adani scam)...జేపీసీ(JPC) విచారణపై బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్(KCR) తన వైఖరి స్పష్టం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు.

Update: 2024-12-18 10:57 GMT

దిశ, వెబ్ డెస్క్ : అదానీ స్కామ్(Adani scam)...జేపీసీ(JPC) విచారణపై బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్(KCR) తన వైఖరి స్పష్టం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు. ప్రధాని-అదానీ ఒక్కటై ప్రపంచ వేదికపై భారత ప్రతిష్ఠను దిగజార్చుతున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఈ దేశ ఔన్నత్యానికి, సమున్నత వారసత్వమైన కాంగ్రెస్ పార్టీ దేశానికి పూర్వ ప్రతిష్ఠ కోసం కొట్లాడుతోందని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో దేశ వ్యాప్తంగా కొట్లాది మంది కాంగ్రెస్ సైనికులు ఈ దేశ ప్రతిష్ఠకు పహారాకాయాల్సిన సందర్భం ఇదని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

ఈ విషయాన్ని ఎలుగెత్తి చాటుతూ అదానీ కుంభకోణాలపై జేపీసీ వేయాలన్న డిమాండ్ తో ఈ రోజు రాజ్ భవన్ కు మార్చ్ ఫాస్ట్ చేయడం జరిగిందన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను రేవంత్ రెడ్డి పోస్టు చేశారు. ఈ కీలక సందర్భంలో అదానీ స్కామ్ లు, జేపీసీ విచారణపై కేసీఆర్ వైఖరి ఏమిటో స్పష్టం చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

Tags:    

Similar News