TPCC: తొందపడి ఓ కోయిల ముందే కూస్తుంది.. కేటీఆర్‌పై కాంగ్రెస్ నేత హాట్ కామెంట్స్

అవినీతి అక్రమాలు చేసిన వాళ్లు ఎవరైనా అరెస్ట్ కాక తప్పదని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్(TPCC General Secretary Addanki Dayakar) అన్నారు.

Update: 2024-12-18 10:52 GMT

దిశ, వెబ్ డెస్క్: అవినీతి అక్రమాలు చేసిన వాళ్లు ఎవరైనా అరెస్ట్ కాక తప్పదని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్(TPCC General Secretary Addanki Dayakar) అన్నారు. దమ్ముంటే అరెస్ట్(Arrest) చేసుకోండి అంటున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ట్విట్టర్ వేదికగా వీడియో విడుదల చేశారు. ఇందులో ఆయన మాట్లాడుతూ.. ట్విట్టర్ పిట్ట కేటీఆర్ దమ్ముంటే నన్ను అరెస్ట్ చేసుకోండి అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడని, అవినీతి అక్రమాలు చేసిన వాళ్ళు ఎవరైనా సరే అరెస్టు కాక తప్పదని స్పష్టం చేశారు. ఎవరికి లేని ఆత్రుత కేటీఆర్ కి ఎందుకు వస్తుందో అర్థం కావట్లేదని, తొందరపడి ముందే కోయిల ఎందుకు కూస్తుందో తెలియట్లేదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

అలాగే ప్రజల సొమ్ము గుంజుకొని, దోచుకుంటే ఖచ్చితంగా అరెస్టు కాక తప్పదని, మీ ప్రభుత్వంలో(BRS Government) మీకు ఎదురు మాట్లాడిన వారిని అక్రమంగా అరెస్టు చేసి జైల్లో పెట్టినట్టు కాదని విమర్శలు చేశారు. అంతేగాక మా ప్రభుత్వంలో(Congress Government) అన్ని శాస్త్రబద్ధంగా, శాస్త్రీయంగా జరుగుతాయని, రాష్ట్రంలో జరిగిన అవినీతిలో కేటీఆర్ శాఖలో అధిక శాతం జరిగిందని ఆరోపించారు. గత ప్రభుత్వం వాళ్ళ అవినీతికి అడ్డు లేకుండా పోయిందని, 30 వేల ఎకరాల రైతుల భూములు గుంజుకున్న బీఆర్ఎస్ ఇప్పుడు లగచర్ల(Lagacharla) గురించి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. వేల ఎకరాల భూదాన్ భూములు గుంజుకున్న మీరు అవినీతి గురించి మాట్లాడుతున్నారని, చట్టానికి వ్యతిరేకంగా ఎవరు పని చేయరని గుర్తుంచుకోవాలని అద్దంకి వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News