Prajavani: ఇక ప్రభుత్వానికి మీ సమస్యలు చెప్పుకోండి.. ప్రజాభవన్‌లో ప్రజావాణి స్టార్ట్

ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం మొదలుపెట్టిన ప్రజావాణి కార్యక్రమం ఇవాళ్టి నుంచి తిరిగి ఘనంగా ప్రారంభం అయింది.

Update: 2024-06-07 07:37 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం మొదలుపెట్టిన ప్రజావాణి కార్యక్రమం ఇవాళ్టి నుంచి తిరిగి ఘనంగా ప్రారంభం అయింది. లోక్ సభ ఎన్నికల కోడ్ కారణంగా ఇన్నాళ్లు ప్రజావాణి కార్యక్రమం తాత్కాలికంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. కోడ్ ముగియడంతో ప్రజావాణి అర్జీల స్వీకరణ షూరు అయింది. ఇవాళ హైదరాబాద్ లోని ప్రగతి భవన్ ను మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్‌లో అధికారులు ప్రజల అర్జీలను స్వీకరిస్తున్నారు. గతంలో లాగే పబ్లిక్ ప్రజాభవన్‌కు సమస్యలు చెప్పుకోవడం కోసం క్యూ కట్టారు.

కాగా, ఇక్కడ ప్రతి వారం మంగళ, శుక్ర వారాల్లో ప్రజలు తమ సమస్యలపై అర్జీలు పెట్టుకుంటారు. ప్రజావాణి స్టేట్ నోడల్ ఆఫీసర్ గా రాష్ట్ర మున్సిపల్ డైరెక్టర్‌గా దివ్య వ్యవహరిస్తున్నారు. తాజాగా ఎన్నికల కోడ్ ముగియడంతో ప్రజావాణి అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, ప్రజలు తమ సమస్యలను అర్జీల ద్వారా ప్రజావాణిలో అందజేయాలని ప్రజావాణి ఇంచార్జీ, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి తాజాగా కోరారు.

Tags:    

Similar News