హైదరాబాద్ వాసులకు BIG షాక్.. న్యూ ఇయర్ వేడుకలపై పోలీసుల ఆంక్షలు
హైదరాబాద్‌లో న్యూ ఇయర్ వేడుకల(New Year Celebrations)పై పోలీసుల ఆంక్షలు విధించారు.
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో న్యూ ఇయర్ వేడుకల(New Year Celebrations)పై పోలీసుల ఆంక్షలు విధించారు. గురువారం న్యూ ఇయర్ ఈవెంట్ నిర్వాహకులకు పోలీసులు(Hyderabad Police) కీలక హెచ్చరికలు జారీ చేశారు. ఈవెంట్స్‌లో సీసీ కెమెరాలు తప్పనిసరి చేశారు. వేడుకల్లో అశ్లీల నృత్యాలపై నిషేధం విధించారు. ఔట్‌డోర్‌లో రాత్రి 10 తర్వాత లౌడ్ స్పీకర్లు బ్యాన్ చేశారు. పబ్‌లు, బార్లలో మైనర్లకు అనుమతి నిరాకరించారు. పార్టీల్లో డ్రగ్స్ వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తాగి వాహనం నడిపితే రూ.10 వేలు జరిమానా, 6 నెలలు జైలు విధిస్తామని వార్నింగ్ ఇచ్చారు. మైనర్లు వాహనం నడిపితే యజమానిపైనా కేసు నమోదు చేస్తామని పేర్కొన్నారు. ర్యాష్ డ్రైవింగ్‌పై వెహికల్ యాక్ట్ కింద కేసు నమోదు చేస్తామని తెలిపారు.