Lip kiss : మ‌ద్యం మ‌త్తులో యువ‌తికి లేడీ పోలీస్ లిప్‌కిస్

డ్రంక్ ఆండ్ డ్రైవ్, పబ్లిక్ న్యూసెన్స్ చేసే వారిని అడ్డుకొని శాంతిభద్రతలను కాపాడాల్సిన ఓ మహిళా పోలీస్(Lady Police) మద్యం మత్తులో అవాంఛనీయ చర్యకు పాల్పడింది

Update: 2024-10-26 12:49 GMT

దిశ, వెబ్ డెస్క్ : డ్రంక్ అండ్ డ్రైవ్, పబ్లిక్ న్యూసెన్స్ చేసే వారిని అడ్డుకొని శాంతిభద్రతలను కాపాడాల్సిన ఓ మహిళా పోలీస్(Lady Police) మద్యం మత్తులో అవాంఛనీయ చర్యకు పాల్పడింది. పశ్చిమ బెంగాల్‌ సిలిగురిలోని ఓ స్కూల్ గ్రౌండ్‌లో కూర్చుని మాట్లాడుకుంటున్న ఇద్దరు మైన‌ర్లపై ఏఎస్సై తనియా రాయ్ (ASI Tania Roy)అకారణంగా చేయి చేసుకుంది. తనియా చర్యలను గమనించిన స్థానికులు ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేసి తమ నిరసన తెలిపారు. ఓ యువతి ఏఎస్సై తనియా రాయ్ వద్ద మద్యం వాసన వస్తుందంటూ విమర్శించింది. నా దగ్గర మద్యం వాసన ఎందుకొస్తుందంటూ ఆ యువతిపై కోపం ప్రదర్శించిన తనియా రాయ్ యువతికి లిప్ కిస్(Lip kiss) ఇచ్చి వాసనొస్తుందా అంటూ ప్రశ్నించింది. లేడీ ఏఎస్సై చర్యలతో కోపోద్రిక్తులైన స్థానికులు ఆమె వ్యవహార శైలిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. సంఘటన వివరాలను విచారించిన ఉన్నతాధికారులు ఏఎస్సై తనియా రాయ్ ని విధుల నుంచి సస్పెండ్ చేశారు. అయితే మద్యం మత్తులో వీరంగం వేసి యువతికి లిస్ కిస్ ఇచ్చిన ఏఎస్సై వ్యవహారం వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. 

Tags:    

Similar News