TG: పిడమర్తి రవి కీలక ప్రకటన
దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణను ఆమోదించి, మాదిగలకు తొమ్మిది శాతం రిజర్వేషన్ కల్పించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి కృతజ్ఞతలు తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో: దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణను ఆమోదించి, మాదిగలకు తొమ్మిది శాతం రిజర్వేషన్ కల్పించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పది పాత ఉమ్మడి జిల్లాలు.. కొత్త 23 జిల్లాలు ఒక 20 నియోజకవర్గాల్లో మొదటి విడతగా ఈనెల 24 నుంచి కృతజ్ఞత యాత్ర చేపడుతున్నామని పిడమర్తి రవి ప్రకటించారు. ఏప్రిల్ ఫస్ట్ రెండో విడత ఉంటుందని.. ఇందులో 35 నియోజకవర్గాల్లో యాత్ర చేస్తామని అన్నారు. ముగింపు సభ ఏప్రిల్ 14న సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్‌లోని 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం వద్ద ఉంటుందని అన్నారు. 30 ఏళ్ల ఆకాంక్షను నెరవేర్చిన కాంగ్రెస్ పార్టీకి, సీఎంకు మాదిగ జాతి రుణపడి ఉంటుందన్నారు.