'డాక్టర్లు సమయానికి ఎందుకు రారు..?' ఆసుపత్రుల సమస్యలపై శివసేన పార్టీ అధ్యక్షులు ఫైర్

ప్రభుత్వ, ప్రవేట్‌ ఆసుపత్రుల సమస్యలపై శివసేన పార్టీ నాగర్ కర్నూల్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో 'ప్రజావాణి' కార్యక్రమంలో భాగంగా జిల్లా అదనపు కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు.

Update: 2023-07-24 13:26 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ, ప్రవేట్‌ ఆసుపత్రుల సమస్యలపై శివసేన పార్టీ నాగర్ కర్నూల్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ప్రజావాణి కార్యక్రమంలో  జిల్లా అదనపు కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. అనంతరం శివసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సింకారు శివాజీ మాట్లాడుతూ.. నాగర్ కర్నూల్ జిల్లాలో ప్రభుత్వ ఆస్పత్రిలో సరైన సమయానికి పూర్తి వైద్యం అందని కారణంగా అట్టడుగు, బడుగు బలహీన వర్గాల ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో కేవలం వారం రోజులలో ఒకే ఒక్క రోజు మాత్రమే ఎందుకు గర్భిణి స్త్రీలకు స్కానింగ్‌ అందుబాటులో ఉంటుందో అర్ధం కావడం లేదని అసహనం వ్యక్తం చేశారు. అధికారులు సరైన సమాయానికి ఆసుపత్రికి రాని కారణంగా ప్రజలు ఎదురు చూసి ఇబ్బందులు పడి, ప్రవేట్‌ ఆసుపత్రికి వెళ్తున్నారు అన్నారు.

ప్రభుత్వ ఆసుపత్రులలో సిబ్బంది కొరత ఉందని తెలిపారు. జిల్లాలో ప్రవేట్‌ ఆసుపత్రులను నియత్రించే నాధుడే లేకుండా పోవటం కూడా దారుణమైన విషయమని అన్నారు. ప్రభుత్వ వైద్యా అధికారులకు రాజకీయ అండ ఉందని ఆరోపణలు చేశారు. ఈ కార్యక్రమంలో యువ సేన నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు విష్ణు, యువ సేన జిల్లా ప్రధాన కార్యదర్శి సిజ్జు, శంకర్, విద్యార్థి సేన నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు మారుతి, విద్యార్థి సేన జిల్లా ప్రదాన కార్యదర్శులు గుడ్లనరం సాయి, దెవపూజ అఖిల్‌, విద్యార్థి సేన యువ సేన నాయకులు తరుణ్‌, బాను ప్రకాష్, శ్రీకాంత్, ప్రశాంత్‌, బాను, మల్లెష్, తదితరులు పాల్గొన్నారు.


Similar News