నగరంలో వరదల నివారణపై డాక్యుమెంటరీ

హైదరాబాద్‌లో వరదలను నివారించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జస్టిస్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా కీలకమైన కార్యక్రమాన్ని నిర్వహించింది.

Update: 2024-10-21 17:00 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్‌లో వరదలను నివారించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జస్టిస్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా కీలకమైన కార్యక్రమాన్ని నిర్వహించింది. బంజారాహిల్స్ లో సోమవారం ‘హైదరాబాద్ వరదలు.. నివారణలో ప్రభుత్వ, పౌరుల పాత్ర’పై జస్టిస్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు గౌతం రాగి ఆధ్వర్యంలో డాక్యుమెంటరీని ప్రదర్శించారు. అదేవిధంగా వరద రహిత హైదరాబాద్ కోసం సమగ్ర విధానం పేరిట శ్వేత పత్రాన్ని ఆయన విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరం తీవ్రమైన వరదలతో అల్లకల్లోలంగా మారుతోందని అన్నారు. వరదల కారణంగా తీవ్ర నష్టం సంభవించిందని గుర్తు చేశారు. ప్రజలంతా ముందస్తుగా చర్యలు తీసుకోకపోతే 2020 వరదలను మించి అధిక తీవ్రతతో కూడిన వరదలను ఎదుర్కోవాల్సి వచ్చే ప్రమాదముందని ఆయన వివరించారు. మహా నగరంలో వరద నివారణకు పరిష్కార మార్గాల కోసం తామెంతో నిబద్ధతతో పని చేస్తు్న్నామని వెల్లడించారు. వరద రహిత హైదరాబాద్‌పై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని.. తాము చేపడుతున్న ప్రయత్నానికి ప్రతి ఒక్కరి మద్దతు ఉండాలని వారు కోరారు. అప్పుడే ప్రతికూల పరిస్థితుల నుంచి నగరాన్ని రక్షించుకోవచ్చని తెలిపారు.


Similar News