Disha Special Story: డ్రింకర్ మ్యాన్.. రూ.1.60 లక్షల కోట్ల మద్యం తాగిన తెలంగాణ ప్రజలు
తెలంగాణ రాష్ట్ర ప్రజలు మద్యం, మంచింగ్‌కు సంవత్సరానికి 50వేల కోట్ల వరకు ఖర్చుచేస్తున్నారు.
దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాష్ట్ర ప్రజలు మద్యం, మంచింగ్‌కు సంవత్సరానికి 50వేల కోట్ల వరకు ఖర్చుచేస్తున్నారు. మద్యం ద్వారా ప్రభుత్వానికి పన్నుల రూపంలో వస్తున్న ఆదాయం, తయారి, తాగేటప్పుడు చేస్తున్న ఆహార పదార్ధాల ఖర్చులను లెక్కెస్తే ఈ లెక్కలు స్పష్టం చేశాయి. గత సంవత్సరం ఆదాయాన్ని పరిశీలిస్తే ప్రభుత్వానికే పన్నుల రూ.28286 కోట్ల ఆదాయం వచ్చింది. అయితే కంపెనీలు, రిటైలర్ ల లాభం మొత్తంగా లెక్కవేస్తే కనీసం ప్రజలకు మద్యానికి రూ.40వేల కోట్ల ఆదాయాన్ని వెచ్చించారనేది సుస్పష్టం. వీటికి అదనంగా మంచిగ్ పేరుతో, చికెన్, మటన్, పల్లిలు, వాటర్‌బాటిల్, ఇతరత్రా ఆహారపదార్ధాలను లెక్క వేస్తే దాదాపుగా సంవత్సరానికి ప్రజలు మద్యం మీద ప్రత్యక్షంగా, పరోక్షంగా 50వేల కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి 2023–24 ఆర్ధిక సంవత్సరం నాటికి మద్యంపైనే రూ.1.60 లక్షల కోట్ల ఆదాయం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2014–15 మొదటి ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ఖజానాకు 6,095 కోట్ల ఆదాయం రాగా 2023–24 ఆర్థిక సంవత్సరంలో 28,286 కోట్లకు చేరింది. పది యేండ్లలో దాదాపుగా ఐదింతల ఆదాయం పెరిగింది. మద్యం షాపుల సంఖ్య కూడా రాష్ట్రం ఏర్పడే నాటికి ఉన్న వాటికి కంటే 400 షాపులు పెరిగాయి. బార్ల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. 797 నుంచి 1176 కు పెరిగాయి. మద్యం షాపులే కాకుండా ప్రతి గ్రామంలో ప్రతి వాడలో బెల్ట్‌షాపులు ఏర్పాటుచేయడంతో మద్యం ప్రజలకు నిత్యావసర వస్తువు తరహాలో లభ్యమైంది. అందుబాటులో ఉన్నది కాబట్టి తాగడం కూడా పెరిగింది. దీంతో ప్రజలకు జేబులు గుల్ల అయ్యాయి. గ్రామాల్లో శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమైంది.ఆ మూడు సంవత్సరాల్లోనే ప్రభుత్వానికి అత్యధిక ఆదాయం ప్రభుత్వం సమకూరింది. 2018–19లో ప్రభుత్వానికి మద్యం ద్వారా రూ.10256 కోట్ల ఆదాయం రాగా 2020–21 వచ్చే సరికల్లా ఆ ఆదాయం కాస్తా రెట్టింపు కంటే ఎక్కువగా రూ.21750 కోట్లు అయింది.
గతంలో ప్రభుత్వం తీసుకవచ్చిన సంస్కరణలు, ధరలు ఒకే సారి పన్నులు పెంచడం, షాపుల సంఖ్య పెంచడం మద్యం పాలసీ పేరుతో ప్రభుత్వం తీసుకవచ్చిన సంస్కరణలతో ఒక్క సారిగా ఆదాయం గణనీయంగా పెరిగింది. ప్రజలపై భారం పడింది. ధరలు భారం పెరిగినా ఎక్కడా విక్రయాలు తగ్గలేదు. రాష్ట్ర ప్రభుత్వానికి గత దశాబ్ద కాలంలో వచ్చే ప్రధాన ఆదాయ వనరులో 10.73 శాతం మద్యం ద్వారానే ఆదాయం వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధానంగా వచ్చే ఆదాయ వనరులో మద్యం ద్వారానే అత్యధిక వస్తుందనేది ప్రభుత్వ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. 2014 నుంచి 2024 మార్చి చివరి వరకు ప్రభుత్వం మొత్తం రూ.14,89,421 కోట్లు ఆదాయం రాగా వచ్చింది. ఇందులో 1,59,863 కోట్లు మద్యం ద్వారానే గత దశాబ్దకాలంలో సాధించింది. దీంతో దాదాపుగా 11 శాతం ఆదాయం ప్రభుత్వానికి మద్యం ద్వారానే వచ్చింది.
ఈ మూడు సంవత్సరాల సమయంలో అసెంబ్లీ, పార్లమెంట్, స్థానిక సంస్థల ఎన్నికలు ఉండటం అదే సమయంలో దుకాణాల సంఖ్య, బార్ల సంఖ్య పెరగడం, మద్యం ధరలు పెరగడంతో ఒక్క సారిగా ఆదాయం రెండు సంవత్సరాల్లో రెడింతలు అయింది. గతంలో మండల కేంద్రాల్లో ఉన్న మద్యం షాపులు బెల్ట్ షాపుల పేరుతో ప్రతి గ్రామానికి, వాడకు, తండాకు, గూడెనాకి వచ్చాయి. ప్రజలకు అందుబాటులోకి రావడంతో విక్రయాలు పెరిగాయి. అదే సమయంలో తక్కువ ధరకు లభ్యం అయ్యేది కాస్తా బెల్ట్‌షాపుల యజమానులు తమ లాభాల కోసం రేట్లను పెంచేశారు. ఇలా ప్రజల మీద పరోక్ష భారం పడుతుంది. మద్యం షాపుల దరకాస్తుల ద్వారానే 2వేల కోట్లకు పైగా ఆర్జించింది. లక్కి డ్రా విధానాన్ని తీసుకవచ్చి దరకాస్తులతోనే పెద్ద ఎత్తున నిధులను జమ చేశారు. గతంలో ఎక్కువ మొత్తానికి కోట్‌చేసిన వారికి మద్యం షాపులు దక్కేవి. ఆ విధానాన్ని తీసేసి అందరికి ఒకటే రేటు... అయితే లాటరీ విధానాన్ని తీసుకవచ్చారు. దీంతో తమ అదృష్టాన్ని పరిక్షించుకోవడానికి వేల సంఖ్యలో దరకాస్తులు వచ్చాయి. ఒక్కోక్కరు ఏదో ఒక షాపు దక్కకపోతుందా అనే కోణంలో పదుల సంఖ్యలో దరకాస్తుల చేశారు. ఒక్కొ దరకాస్తుకు రెండు లక్షల రూపాయల చొప్పున నిర్ణయించారు. దీంతో దరకాస్తుల ద్వారా రెండు వేల కోట్లపైనే ఆదాయం వచ్చింది.
తెలంగాణ రాష్ట్రం బీరు మార్కెట్ఎక్కువ... ఆంధ్ర ప్రదేశ్రాష్ట్రం లిక్కర్ మార్కెట్ఎక్కువని విశ్లేషించారు. తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా బీర్లను తాగుతారు. దశాబ్ద కాలం క్రీతం వరకు ఉమ్మడి రాష్ట్రంగా మెలిగిన ఆంధ్ర ప్రదేశ్ ను లిక్కర్రాష్ట్రంగా నిపుణులు చెబుతున్నారు. తెలంగాణలో అత్యధిక బీరు విక్రయాలు జరగడానికి ప్రధాన కారణాల్లో ఇక్కడ ఐటీ పరిశ్రమ ఎక్కువ ఉండటం, ఇక్కడ యువత ఎక్కువ ఉండటం, ఇక్కడి వాతావరణం, రియల్ఏస్టేట్ వ్యాపారం అధికంగా ఉండటం, వ్యాపార కేంద్రంగా ఉండటం తదితర కారణాలతో ఇక్కడ ఎక్కువగా బీర్లు అమ్మకాలు అత్యధికంగా ఉంటున్నాయని విశ్లేషిస్తున్నారు. తెలంగాణలో ఉత్తర తెలంగాణ ఎక్కువ వేడి వాతావరణం ఉండటంతో అక్కడ కూడా ఎక్కువగా బీరు తాగుతారని, ఇటు హైదరాబాద్, అటు ఉత్తర తెలంగాణలో విక్రయాలతో బీర్లకు ఎక్కువగా డిమాండ్ ఉంటుంది. బ్రేవరిజీల్లో బీరు తయారు అవుతుంది. డిస్టలరీల్లో లిక్కరు తయారు అవుతుంది.
తెలంగాణలో ప్రస్తుతానికి నెల గరిష్ఠంగా 70 లక్షల కేసుల బిర్లు ఉత్పత్తి చేసే సామర్ధ్యం ఉంది. అయితే ఇందులో వివిధ సాంకేతిక పరమైన కారణాలతో గరిష్ఠంగా 90 శాతం మాత్రమే ఉత్పత్తి వస్తుంది. రాష్ట్రంలో ఆరు బ్రేవరేజేస్‌లు ఉన్నాయి. వీటన్నంటి ద్వారా 70 లక్షల కేసులను మాత్రమే గరిష్ఠంగా తయారు చేయవచ్చు. వీటిని ఉత్పత్తిని చేయడానికి రెండు షిప్ట్లల్లో 16 గంటల పాటు పనిచేయాల్సి ఉంటుంది. అయితే వేసవి కాలంలో ఈ ఉత్పత్తి సరిపోవడంలేదు. మూడో షిప్ట్పనిచేయడానికి అస్కారంలేదని నిపుణులు చెబుతున్నారు. 16 గంటల పాటు మిషన్ లు నడవటం వల్ల మిషన్లు వేడి అయి ఉంటాయని అంత కంటే ఎక్కువగా పనిచేయలేమని చెబుతున్నారు. 70 లక్షల కేసుల్లో 30 లక్షలు కింగ్ఫిషర్కు చెందినఒక బ్రేవరీలో, మరోక దాంట్లో 5 లక్షలు కేసుల బీర్లు తయారు చేస్తారు. మరో నాక్ అవుట్, బడ్వైయిజర్, హెవర్డ్లో మొత్తంలో 16లక్షల కేసులు ఒక దాంట్లో, మరోక దాంట్లో 7 లక్షలు ఉత్పత్తి అవుతాయి. వీటిల్లోనే దాదాపుగా 58లక్షల కేసులు ఇక్కడే తయారవుతాయి. మరో 7 లక్షలది కాజ్వన్బీరు, మరో ఐదు లక్షలు ఖజురహో, మరోకటి అమెరికా కంపెనీకి చెందివని ఉన్నాయి. ఇవన్ని కలిపి కూడా 65 లక్షల కేసుల బిర్లు వరకు తయారు చేయగలుగుతాయి. రాష్ట్రంలో 650 మిల్లీ లీటర్ల బీరు బాటిల్స్అత్యధికంగా అమ్ముడుపోతాయి.89 శాతం పెద్ద బీరు బాటిల్స్‌నే ఎక్కువగా తాగుతారు. 330 మిల్లి లీటర్ల బీరు బాటిల్స్ ఎక్కువగా అమ్ముడు పోవు. ఒక నిమిషంలో 300–360 బీర్లు తయారవుతాయి... అంతటి సామర్ధ్యం ఉన్న యంత్రాలు ఇక్కడ ఉన్నాయి. రాష్ట్రంలో మార్చిలో 40–45 లక్షల కేసులు, ఏప్రిల్ లో 50 లక్షల కేసులు, మే లో 65 లక్షల కేసులు డిమాండ్ఉంటుంది. రాష్ట్రంలో అత్యధికంగా మే నెలలో బీర్ల డిమాండ్ఉంటుంది. ఆ నెల అవసరాలకు తగ్గట్టుగా ఉత్పత్తి చేసే సామర్ధ్యం ఉందని, అయితే రవాణా, మేనేజ్ మెంట్ తదితర కారణాలతో గ్యాప్ వచ్చి ఆ నెలలో బీర్ల కొరత అని, బీర్లు నో స్టాక్ అని బోర్డులు దర్శనమిస్తుంటాయని తయారిదార్లు చెబుతున్నారు.
రాష్ట్రంలో ప్రతి రోజు రూ.110–130 కోట్లు మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. రిటైలర్ కు 20 శాతం మార్జిన్‌తో అమ్మకం చేస్తారు. ఉదాహరణకు పరిశీలిస్తే రూ.25 కింగ్ఫిషర్ఒక్ బీరు బాటిల్ తయారైతది. దీనిని బయట రూ.150లకు విక్రయిస్తున్నారు. రిటైలర్ మార్జిన్ ను 20 రూపాయల వరకు ఉంటుంది. మిగిలిన 100కు రూపాయలకుపైగా ప్రభుత్వం పన్నుల రూపంలో వెళ్తుంది. మరోక ఉదాహరణ చూసుకుంటే ఆఫీసర్స్చాయిస్(ఓసీ) క్వార్టర్బాటిల్రూ.18 తయారు అవుతుంది. అయితే దీనిని అన్ని పన్నులు కలుపుకొని బయట రిటైలర్ రూ.150 లకు విక్రయిస్తున్నారు. ఇందులో రిటైలర్20 శాతం వరకు లాభం ఉంటుంది. మిగిలింది ప్రభుత్వాలకు పన్నుల రూపంలో వెళ్తుంది.
ఎలా తయారు చేస్తారంటే...
బీరును మాల్ట్అనే ఆహర పదార్ధం నుంచి తయారు చేస్తారు. ఇది చలి ఎక్కువగా ఉండే పంజాబ్, కశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్‌లాంటి రాష్ట్రాల్లో పండుతుంది. ఇది గోదుమ తరహాలో ఉంటుంది. బీరుల్లో 76 శాతం ఇదే ఉంటుంది. దీనితోనే బోర్న్ వీటా, బూస్ట్ లాంటివి కూడా తయారు చేస్తారు. వీటితో పాటుగా బార్లీ, మొక్కజోన్నలను కూడా కలిపి దీనిని తయారు చేస్తారు. నానబెట్టి దీన్ని తయారు చేస్తారు. బీరు తయారిలో వాడే పదార్ధాలను నానబెట్టి ఉండే రోజులను బట్టి దానిని మాములు బీరు, స్ట్రాంగ్బీరుగా పరిగణనిస్తారు. మాములు బీరు అయితే 14 రోజుల పాటు నానబెట్టి ఆ తరువాత బీరు తయారికి వాడితారు. 17 రోజులు నానబెట్టి ఆ తరువాత తయారు చేస్తే అది స్ట్రాంగ్బీరుగా మారుతుందని చెబుతున్నారు. ఇంకా ఎక్కువ రోజులు అయితే తాగే వారికి ఆరోగ్య సమస్యలు వస్తాయని, అంత కంటే ఎక్కువగా ఉంచరు. ట్యాంకర్లలో నానబెట్టినప్పుడు సహజంగానే 5 శాతం వరకు అల్కాహాల్ఉంటుంది. దీనితో కొంత చేదు వస్తుంది. దీనిని తగ్గించడానికి కొద్ది పరిమాణంలో చక్కెరును కూడా వాడుతుంటారు. బీరు అతి తక్కువగా అల్కహాల్ఉంటుంది. బీరులో ఎంత అల్కహాల్వరకు ఉండోచ్చు అనేది ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. దానికి అనుగుణంగానే తయారీ కంపెనీలు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. 4.5శాతం వరకు అల్కహాల్ఉంటే దానినే లాగర్బీరు అంటారు. 5–6 శాతం వరకు అల్కహాల్ఉంటే దానిని ప్రిమియం బీరు అంటారు. 6–7.5 శాతం అల్కహాల్ ఉంటే దానినే స్ట్రాంగ్బీరు అంటారు. ఇంత వరకే ప్రభుత్వం బీరులో అల్కహాల్ ఉండటానికి అనుమతి ఇచ్చింది. దీనిని మైనస్0.5 డిగ్రిల ఉష్ణోగ్రతల్లో నుంచి బయటికి తీస్తారు. ఆ తరువాత సాధారణ ఉష్ణోగ్రతలో బాటిలింగ్చేస్తారు.
డ్రాఫ్ట్బీరు...
ప్రస్తుతం మార్కెట్లో రెండు రకాల బీరులు లభ్యమవుతున్నాయి. ఒకటి బాటిలింగ్బీరు, మరోకటి డ్రాఫ్ట్బీరు. బాటిలింగ్బీరు. ఇది మార్కెట్లో ఎక్కడైనా లభ్యమవుతుంది. మద్యం ప్రియులకు ఎక్కడైనా లభ్యమయ్యేది ఇది. గత కొన్ని సంవత్సరాలుగా హైదరాబాద్ లాంటి మహా నగరాల్లో లభిస్తున్నది డ్రాఫ్ట్బీరు. గ్లాసుల్లో పోసుకు తాగేది. అయితే ఈ రెండింటికి పెద్దగా తేడా ఉండదని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. డ్రాఫ్ట్ బీరు బాటిలింగ్ కు ముందు తీస్తారని, బాటిలింగ్ బీరు మాత్రం బాలిల్లో పోసేటప్పుడు సీవోటూ ఉంటుందని, అందుకే ఒక వేళ బాటిల్‌ను షేక్ చేస్తే పొంగుతుందని చెబుతున్నారు. రెండింటి టెస్ట్‌లో పెద్దగా తేడా ఉందని స్పష్టం చేస్తున్నారు. బాటిలింగ్ప్యాకింగ్తదితర కారణాలతో ధరలో కొద్దిగా తేడా ఉండోచ్చంటున్నారు. బాటిలింగ్బీరులో సీవోటూ ఉంటుంది కాబట్టి దానిని ఒక సారి ఓపెన్‌చేస్తే వెంటనే తాగాల్సి ఉంటుంది. దానిని నిల్వచేయడానికి అవకాశం ఉండదు. ఒక బీరు తాగితే ఎలాంటి ప్రమాదం, నష్టం ఉండదు. ఒక బీరులో ఐదు శాతం మాత్రమే అల్కహాల్ ఉంటుంది. మహా అయితే టాయిలెట్రూపంలో వెళ్తుంది. అయితే రెండు బాటిల్స్తాగితే పది శాతం అల్కహాల్‌లో 5 శాతం శరీరంలోనే అల్కహాల్ఉండిపోతుంది. దీనితో సమస్యలు రావచ్చు. ఒక బీరుతో ఎలాంటి సమస్యలు ఉండవు. లిక్కరును ఈఎన్ఏ తో తయారు చేస్తారు. నూకలను నానబెట్టి తయారు చేస్తారు. ఎక్స్ట్రా న్యూట్రల్ అల్కాహల్(ఈఎన్ఏ) తో లిక్కరును తయారు చేస్తారు. లిక్కరు రెండు లాగర్ బీరు బాటిల్లతో ఒక 60 మిల్లీ లీటర్ల లిక్కరు సమానం. ఇందులో 25 శాతం వరకు అల్కహాల్ఉంటుంది.