పలువురు ఎస్ఐలు బదిలీ

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పలువురు ఎస్ఐలను బదిలీ చేస్తు పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగానారే ఉత్తర్వులు జారీ చేశారు.

Update: 2024-03-15 16:13 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పలువురు ఎస్ఐలను బదిలీ చేస్తు పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగానారే ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు 18 మంది ఎస్ఐలకు స్థాన చలనం చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు విడుదల చేశారు. అదిలాబాద్ పోలీస్ స్టేషన్ 1 లో ఎస్ఐగా పని చేస్తున్న సాయన్నను ఖాళీగా ఉన్న రేంజల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐగా పోస్టింగ్ ఇచ్చారు. నిర్మల్ జిల్లా బైంసా ఎస్ఐగా ఉన్న మహ్మద్ షరీఫ్​ ను నిజామాబాద్ ఒకటవ టౌన్ లో రెండవ ఎస్ఐగా పోస్టింగ్ కు బదిలి చేశారు. నిజామాబాద్ సీఎస్ బీ ఎస్ఐ డి. రమేష్ ను ఆరవ టౌన్ ఎస్ హెచ్ఓగా, డిచ్ పల్లి పోలీస్ స్టేషన్ లో 2 వ ఎస్ఐగా పని చేస్తున్న బి.మనోజ్ కుమార్ ను ఇందల్వాయి ఎస్ హెచ్ఓగా, ఇందల్వాయిలో ఎస్ హెచ్ఓగా పని చేస్తూ సస్పెన్షన్ లో ఉన్న మహేష్ ను నిజామాబాద్ వీఆర్ కు అటాచ్ చేశారు.

    ఐదవ టౌన్ ఎస్ హెచ్ ఓ అప్పారావును ఖాళీగా ఉన్న రూద్రుర్ పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ఓగా బదిలీ చేశారు. రెండవ టౌన్ ఎస్ హెచ్ ఓ అశోక్ ను ఐదవ టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ 1 గా నియమించారు. నిజామాబాద్ సీసీఎస్ లో ఉన్న ఎల్ రామును రెండవ టౌన్ ఎస్ఐ 1 గా, ఎడపల్లి ఎస్ హెచ్ఓ విక్రం ను ధర్పల్లి ఎస్ హెచ్ ఓ గా, ధర్పల్లి ఎస్ హెచ్ఓ గా పని చేస్తున్న వంశీ క్రిష్ణను ఎడపల్లి ఎస్ హెచ్ఓగా బదిలీ చేశారు. నిజామాబాద్ వీఆర్ లో ఉన్న పాండ్రేరావు ను ఐదవ టౌన్ ఎస్ఐ 2 గా, నిర్మల్ వీఆర్ లో ఉన్న ఎస్ఐ సంతోష్ రెడ్డిని నిజామాబాద్

    సీఎస్ బీకి, ఉట్నూర్ పీఎస్ 2 లో ఉన్న పి. సాయన్నను నిజామాబాద్ సీఎస్బీకి పోస్టింగ్ ఇచ్చారు. నిజామాబాద్ సీఎస్బీలో ఉన్న సాలియా నాయక్ ను నిర్మల్ డీఎస్బీకి, నిజామాబాద్ సీఎస్బీలో ఉన్న కె.శివాజీని నిర్మల్ సీసీఎస్ కు బదిలీ చేశారు. నిజామాబాద్ సీఎస్బీలో ఉన్న విఠల్ ను నిర్మల్ డీఎస్బీకి, అదిలాబాద్ ట్రాఫిక్ పోలిస్ స్టేషన్ లో రెండవ ఎస్ఐగా ఉన్న సాయన్నను నిజామాబాద్ సీఎస్బీకి, నిజామాబాద్ పీసీఆర్ లో ఉన్న ఎండి. నజీబ్ ను అదిలాబాద్ డీఎస్ బీకి బదిలీ చేశారు. పోస్టింగ్ ఇచ్చిన ఎస్ఐలను వెంటనే రిలీవ్ చేయాలని అసిస్టెంట్ కమిషనర్ ను కమిషనర్ ఆదేశించారు. 


Similar News