యూనివర్సిటీలో ప్రసంగించనున్న జీవన్ రావు

ఈ నెల 21, 22 వ తేదీలలో హరిద్వార్ లోని గురుకుల కండ్రి విశ్వవిద్యాలయంలో జరగనున్న అంతర్జాతీయ సదస్సులో "సూపర్ బ్రెయిన్ యోగా" అనే అంశంపై అందె జీవన్ రావు తన పరిశోధన పత్రాన్ని సమర్పించి ప్రసంగించనున్నారు.

Update: 2024-10-07 16:03 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్: ఈ నెల 21, 22 వ తేదీలలో హరిద్వార్ లోని గురుకుల కండ్రి విశ్వవిద్యాలయంలో జరగనున్న అంతర్జాతీయ సదస్సులో "సూపర్ బ్రెయిన్ యోగా" అనే అంశంపై అందె జీవన్ రావు తన పరిశోధన పత్రాన్ని సమర్పించి ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి అందె జీవన్ రావును అభినందించారు. ఉద్యోగ విరమణ చేసి 10 సంవత్సరాల తర్వాత కూడా సమాజానికి ఉపయోగపడే అంశాలపై పరిశోధనలు చేసి..అంతర్జాతీయ సదస్సులో పరిశోధన పత్రాలు సమర్పించడం అభినందనీయమని ప్రొఫెసర్ లింబాద్రి అన్నారు. సూపర్ బ్రెయిన్ యోగా అంశంపై సమర్పించే పరిశోధన పత్రం ప్రొఫెసర్ లింబాద్రికి అందజేసినట్లు అందె జీవన్ రావు తెలిపారు.


Similar News