ఆ మండలంలో స్పీడ్ బ్రేకర్లు లేవు.. స్పీడ్ బ్రేకర్ వేసేందుకు నిధుల కొరత

పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు గా ఉంది.

Update: 2024-11-26 13:14 GMT

దిశ, గాంధారి: పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు గా ఉంది. ఆ మేజర్ మండల పరిధిలో 44 గ్రామపంచాయతీలు ఉండగా వీటికి మండలమైన మండల కేంద్రంలో కనీసం ఒక్క స్పీడ్ బ్రేకర్ లేని, రోడ్డు సంకేతాలు లేని ఉన్న మండలంగా మండలం ఇదే కాబోలు.ఒకవైపు రోడ్డు ప్రమాదాలు ఒక్క రోజులోనే రెండు ప్రమాదాలు జరుగుతున్న ఆర్ అండ్ బి అధికారులు కనీసం మూలమలుపుల వద్ద రోడ్డు గుర్తులు, స్పీడ్ బ్రేకర్లు కూడా ఏర్పరచకుండా ఆర్ అండ్ బి అధికారుల అలసత్వానికి నిదర్శనంగా మారింది. వివరాలలోకి వెళితే కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలోని భారత్ పెట్రోలియం బంక్ వద్ద గల మూలమలుపు ఇదివరకే ఎంతోమందిని బలి తీసుకోవడం కూడా జరిగింది. దాదాపు మూడు నెలల వ్యవధిలోనే మూల మలుపు వద్ద అనేకమంది క్షతగాత్రులు కాగా ఇందులో చాలామంది ప్రమాదం జరిగిన చోటే చనిపోవడం జరుగుతుంది.

అంతేకాకుండా క్షతగాత్రులు కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. అయితే మండల కేంద్రంలో చాలా చోట్ల కూడా రోడ్డు సూచికల బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు అవసరం చాలా ఉంది ముఖ్యంగా ప్రధాన కూడలి వద్ద స్కూల్ జోన్ల వద్ద అవసరం ఉన్నప్పటికీ వేయలేని పరిస్థితి. చాలా గ్రామాల్లో ఇప్పటికీ రోడ్లు వేసినప్పటికీ స్పీడ్ బ్రేకర్లు వేయాలని పరిస్థితి ఉంది. అంతేకాకుండా పోతంగల్ వద్ద చేపడుతున్న నూతన రోడ్డు నిర్మాణ పనుల్లో భాగంగా అక్కడ కూడా ఇలాంటి ప్రమాద సూచికలు కనిపించకపోగా సంబంధిత కాంట్రాక్టర్ ను వివరణ కోరగా త్వరలోనే ఏర్పాటు చేయిస్తాం అని చెప్పి జారుకున్నారు... మళ్లీ అదే తంతుగా అక్కడ ప్రమాదాలు జరుగుతూ నలుగురి ప్రాణాలు కూడా పోయాయి.

మూలమలుపు వద్ద లేని సంకేతాలు,లేని స్పీడ్ బ్రేకర్లు...

మూలమలుపు వద్ద ఎన్నో ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లు, లారీలతో ప్రమాదాలు చాలానే జరిగాయి. అయితే ఒక్కసారిగా మలుపు ఉండడంతో అంతేకాకుండా ముందస్తుగా వాహనదారులు అప్రమయ్యతమయ్యేందుకు ఏర్పాటు చేయవలసిన గుర్తింపు చిహ్నాలు, స్పీడ్ బ్రేకర్లు లేకపోవడం వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. కేవలం ఆదివారం ఒక్క రోజు వ్యవధిలోనే రెండు ప్రమాదాలు జరిగాయి. ఇందులో బీసీ వాహనం బైక్ పై వెళుతున్న వ్యక్తిని ఢీకొనగా అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. ఇంకొక సంఘటన ఆటో ప్రయాణికులతో వెళ్తున్న అదుపుతప్పి ప్రయాణికులు గాయపడడం జరిగింది. ఇకనైనా అధికారులు స్పందించి వెంటనే వరుసగా జరుగుతున్న ప్రమాదాలకు చెక్ పెట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు.

నిధులు మంజూరు కాలేదు, త్వరలోనే పూర్తి చేస్తాం : ఏఈ రవి

గాంధారి మండల కేంద్రంలో అవసరమైన స్పీడ్ బ్రేకర్లు, సైనింగ్ బోర్డ్స్ చాలా చోట్ల పెట్టాల్సి ఉందని ఇవి లేక మండల కేంద్రంలో పలుచోట్ల ప్రమాదాలు జరుగుతున్నాయని ఆర్ అండ్ బి ఏ ఈ రవిని దిశ వివరణ కోరగా వాస్తవానికి నిధుల కొరత ఉన్నందున పనులు పూర్తిగా చేయలేకపోతున్నామని నిధులు మంజూరు కాగానే పూర్తి స్థాయిలో పనులు చేస్తామని తెలిపారు. ఇదివరకే రెండు మూడు సార్లు పై స్థాయి అధికారులకు కూడా విన్నవించడం జరిగిందని త్వరలోనే నిధులు మంజూరు అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశాడు.


Similar News