ప్రతి పౌరునికి రాజ్యాంగం పై అవగాహన ఉండాలి : కామారెడ్డి ఎమ్మెల్యే
భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అన్నిటి కైనా ముఖ్యమైనదని,
దిశ, కామారెడ్డి : భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అన్నిటి కైనా ముఖ్యమైనదని, అందుకే ప్రతి పౌరునికి రాజ్యాంగం పై పూర్తి అవగాహన ఉండాలని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణా రెడ్డి అన్నారు. భారత రాజ్యాంగానికి ఆమోదం తెలిపి నేటికీ 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కామారెడ్డి జిల్లా బీజేపీ కార్యాలయంలో రాజ్యాంగానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...రాజ్యాంగాన్ని 80 సార్లు సవరించి, 42 వ రాజ్యాంగ సవరణతో ప్రజాస్వామ్యాన్ని హరించిన చరిత్ర కాంగ్రెస్ ది అని ఆరోపించారు.
ఎమర్జెన్సీ నీ విధించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఓట్ల కోసం రాజ్యాంగాన్ని పట్టుకుని తిరగడం సిగ్గు చేటన్నారు. మోదీ హయంలో నే రాజ్యాంగానికి, అంబేద్కర్ కు పూర్తి గౌరవం దక్కిందన్నారు. రాజ్యాంగ నిర్మాణంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పాత్ర చాలా గొప్పదన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణ తార, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి, రవీందర్ రావు, అసెంబ్లీ కన్వీనర్ లక్ష్మారెడ్డి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ శ్రీకాంత్, కౌన్సిలర్లు నరేందర్, శ్రీనివాస్, నాయకులు భరత్, సురేష్, ఈశ్వర్, వేణు, వెంకట్ రెడ్డి, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా పోలీసు కార్యాలయంలో...
భారత రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. అదనపు ఎస్పీ (అడ్మిన్) కే.నరసింహారెడ్డి పోలీస్ అధికారులు, సిబ్బందితో కలిసి ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ఏ ఓ, రిజర్వ్ ఇన్స్పెక్టర్స్ నవీన్ కుమార్, కృష్ణ, ఎ.ఆర్ సిబ్బంది, డిపిఓ సిబ్బంది, హోమ్ గార్డ్సు సిబ్బంది పాల్గొన్నారు.