40 లక్షలతో సీసీ డ్రైనేజీ పనులు ప్రారంభిస్తాం‌‌‌‌- ఎమ్మెల్యే

కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో అగ్రికల్చర్ మార్కెట్ సొసైటీ కి నూతన మార్కెట్ కమిటీ నియమించడం జరిగింది.

Update: 2024-10-07 15:54 GMT

దిశ, గాంధారి: కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో అగ్రికల్చర్ మార్కెట్ సొసైటీ కి నూతన మార్కెట్ కమిటీ నియమించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా బండారి పరమేశ్వర్, వైస్ చైర్మన్గా ఆకుల లక్ష్మణ్, డైరెక్టర్లుగా..అందరికీ ఒకేసారి మదన్మోహన్, ఎంపీ సురేష్ షెట్కర్ ఆధ్వర్యంలో.. సోమవారం ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ మాట్లాడుతూ..గాంధారి మండల కేంద్రానికి క్రీడ మైదానం తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని, కాంగ్రెస్ పార్టీ అతి తక్కువ కాలంలోనే బుగ్గ గండి నుంచి ఆగిపోయిన రోడ్డు పనులను ప్రారంభించడం జరిగిందన్నారు. అంతేకాకుండా కాటేవాడి రోడ్డు,కర్ణం గడ్డ తండా రోడ్డు వేయించడం జరుగుతుందన్నారు. జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్ మాట్లాడుతూ..ఎస్టీ సోదరులకు మంచి పదవి ఇచ్చే బాధ్యతలు తీసుకుంటామన్నారు. అంతేకాకుండా ప్యాకేజీ 22 పూర్తి కోసం శ్రమిస్తామని తెలిపారు. మండల కేంద్రానికి విచ్చేసిన ఎమ్మెల్యే, ఎంపీలకు గజమాలతో సత్కరించడం జరిగింది. కొద్దిరోజుల్లో స్థానిక సంస్థ ఎన్నికలు రాబోతున్నాయని ప్రజలు అందుబాటులో ఉంటూ.. సమస్యలు కార్యకర్తలే ఎమ్మెల్యేలుగా మారి అక్కడికక్కడే సమస్యలు పరిష్కరించాలని ప్రజలకు పార్టీ చేస్తున్న కార్యక్రమాలను వివరించాలని మదన్ మోహన్ అన్నారు. రుణమాఫీపై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని అర్హులైన ప్రతి ఒక్కరికి రుణమాఫీ వస్తుందని తెలియజేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు ఎంవైఎఫ్ యూత్ సభ్యులు పాల్గొన్నారు. 


Similar News