నియోజకవర్గంలో అక్రమ లే అవుట్లు ఉండకూడదు

నియోజకవర్గంలో ఎక్కడ కూడా అక్రమ లే అవుట్లు ఉండకూడదని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు.

Update: 2024-03-14 14:18 GMT

దిశ, కామారెడ్డి : నియోజకవర్గంలో ఎక్కడ కూడా అక్రమ లే అవుట్లు ఉండకూడదని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్, ఆర్ అండ్ బీ, పంచాయతీ రాజ్, విద్యుత్, ఇరిగేషన్, మిషన్ భగీరథ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... నియోజకవర్గంలో అక్రమ లే అవుట్లు ఉండకూడదని, ఇప్పటి వరకు అనుమతి ఇచ్చిన లే అవుట్ లో

    ఏమైనా లోపాలు ఉంటే వెంటనే సవరించాలని సూచించారు. అలాగే మిషన్ భగీరథ నీళ్లు కామారెడ్డి పట్టణంతో పాటు ప్రతి గ్రామంలో క్రమం తప్పకుండా వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. వేసవి కాలంలో నీటి ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు. యాసంగి పంటకు కరెంటు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆ శాఖ అధికారులను ఆదేశించారు. మున్సిపల్ అధికారులు నూతనంగా నిర్మించే భవనాలకు నిబంధనలకు లోబడి ఉంటేనే నూతన అనుమతులు ఇవ్వాలని, ఎలాంటి తప్పిదాలు జరిగినా అధికారులే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. సమీక్షలో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. 


Similar News