రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
రైతుల శ్రేయస్సే ప్రభుత్వ ధ్యేయమని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు.
దిశ, పిట్లం: రైతుల శ్రేయస్సే ప్రభుత్వ ధ్యేయమని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు. పిట్లం మండల మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..జుక్కల్ నియోజకవర్గంలో రైతులు పండించిన ధాన్యాన్ని నిల్వ చేసుకోవడానికి లక్ష మెట్రిక్ టన్నుల గోదాంలు అవసరం ఉన్నాయని, ఈ విషయమై గిడ్డంగుల వ్యవసాయ శాఖ మంత్రి తో మాట్లాడడంతో..సానుకూలంగా స్పందించారని, త్వరలోనే లక్ష మెట్రిక్ టన్నుల గోదాముల నిర్మాణానికి కృషి చేస్తానని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని, ఈ ప్రభుత్వంలో ప్రజలే పాలకులని, రైతులే రాజులని రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం డిసెంబర్ చివరినాటికి ప్రతి ఒక్క రైతుకు రెండు లక్షల రుణమాఫీ వర్తింప చేస్తామన్నారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఇంటర్వ్యూ పద్ధతిలో జుక్కల్ నియోజకవర్గంలో మార్కెట్ కమిటీలను ఏర్పాటు చేయడం జరిగిందని, మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కోసం ఆశపడి రాని వారు నిరాశ చెందవద్దని అన్నారు. భవిష్యత్తులో ఇంకా ఎన్నో అవకాశాలు ఉంటాయని, వారికి వారి ప్రతిభ ఆధారంగా కచ్చితంగా పదవులను ఇవ్వడం జరుగుతుందన్నారు. ఎవరు కూడా పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడవద్దని పార్టీకి విధేయంగా ఉండాలని, పార్టీకి కట్టుబడి నడుచుకోవాలని అన్నారు. నూతనంగా మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్ ను వైస్ చైర్మన్ కృష్ణారెడ్డి దొర పాలకవర్గాన్ని అభినందించారు. రైతుల సంక్షేమానికి కృషి చేయాలని ఎల్లప్పుడూ రైతులకు విధేయత ఉండాలని వారికి సూచించారు . ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ కైలాస్ శ్రీనివాస్, పిట్లం మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ జంబిగి హనుమాన్లు, మాజీ మండల ప్రెసిడెంట్ అడ్వకేట్ రామ్ రెడ్డి, నిజాంసాగర్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ మల్లికార్జున్,మాజీ సొసైటీ చైర్మన్ మోహన్ రెడ్డి, సొసైటీ చైర్మన్ శపథం రెడ్డి, ఎనుగండ్ల శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.