మేయర్ భర్తపై దాడి..పోలీసుల అదుపులో రసూల్
నిజామాబాద్ మేయర్ నీతూ కిరణ్ భర్త దండు శేఖర్ పై దాడికి పాల్పడిన నిందితుడు రసూల్ ను పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ మేయర్ నీతూ కిరణ్ భర్త దండు శేఖర్ పై దాడికి పాల్పడిన నిందితుడు రసూల్ ను పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. శేకర్ పై దాడి ఘటన తరువాత అజ్ఞాతంలోకి వెళ్లిన షేక్ రసూల్ ను పట్టుకోడానికి పోలీసులు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. సోమవారం రాత్రి రసూల్ స్వయంగా వెళ్లి పోలీసులకు లొంగిపోయినట్లు తెలిసింది. పోలీసులు ఘటన పై సుధీర్ఘంగా విచారిస్తున్నట్లు తెలుస్తోంది. రాజకీయంగా బలంగా ఉండటమే కాకుండా మేయర్ భర్త కూడా అయిన శేకర్ పై దాడికి సాహసించడం అంటే ఆషామాషీ కాదని, ప్రత్యర్థి వర్గమైన కాంగ్రెస్, బీజేపీ నేతలు ఎవరైనా ఈ ఘటన వెనక ఉన్నారా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది.