దళిత బందు పై రాబందుల వల..
రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బందు రా బందుల( నేతల)కు విందు అవుతుంది. పైలట్ ప్రాజెక్టుగా కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ మండలం గత ఎడాది ప్రభుత్వం మంజూర్ చేసిన యూనిట్ లకు లక్షలు వసూలు చేస్తున్నారు.
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బందు రా బందుల( నేతల)కు విందు అవుతుంది. పైలట్ ప్రాజెక్టుగా కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ మండలం గత ఎడాది ప్రభుత్వం మంజూర్ చేసిన యూనిట్ లకు లక్షలు వసూలు చేస్తున్నారు. లోకల్ బీఆర్ఎస్ లీడర్ లు డబ్బులు ఇవ్వని వారికి ఎడాది గడుస్తున్న దళిత బందు ఫలాలు అందలేదు అంటే అతి శయోక్తికాదు. దళిత బందు విడుదల జాబితాలో పేరు వచ్చిన లబ్ధిదారులు యూనిట్ కోసం తిరిగితే ప్రభుత్వం 10 లక్షలు తిరిగి చెల్లించకుండా ఇస్తుందన్నారు. తమకు అందులో 1 లక్ష మొదలుకోని 3 లక్షలు ఇవ్వాలని ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధుల పెరు చెప్పి లక్షలు వసూలు చేస్తున్న అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదు.
రాష్ర్టవ్యాప్తంగా తొలి విడత దళితబందు కేవలం 100 మందికి రాగా వాటిని అర్హులైన ఎస్సీలకు ఇవ్వడానికి లోకల్ లీడర్ లు అందిన కాడికి దండుకున్న విషయంపై ఆరోపణలు ఉన్నాయి. హుజురాబాద్ ఉపఎన్నిక సందర్బంగా అక్కడ నియోజకవర్గం మొత్తం అందించిన తరువాత రాష్ర్టంలో నాలుగు రిజర్వు నియోజకవర్గాలలో దళిత బందుకు ఒక మండలంను పైలట్ మండలంగా ఎంపిక చేసి అక్కడ అన్ని దళిత కుటుంబాలకు ఇవ్వాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. కామారెడ్డి జిల్లా జుక్కల్ (ఎస్సీ) నియోజకవర్గంలో ఒక మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని ఆ మండలంలో ఉన్న ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు అందేలా ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకున్నప్పటికీ కొందరు గులాబీనేతలు తమ చేతివాటాన్ని చూపిస్తున్నారు.
నిజాంసాగర్ మండలం 1800 మంది లబ్ధిదారులకు దళితబందు కోసం 2022లో రూ.50 కోట్లు పైచిలుకు విడుదల అయ్యాయి. నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట గ్రామంలో కటిక పేదవారైనా 20 దళిత కుటుంబాలకు మంజూరు ఐనా దళిత బంధు పథకం వారి చెంతకు చేరలేక పోయింది. స్థానిక ప్రజాప్రతినిధి మరికొంత మంది గులాబీ నేతలు తమకు 80 శాతం వాటా ఇస్తేనే దళిత బంధు పథకం ద్వారా డబ్బులు ఇప్పిస్తామని, లేదంటే ఇప్పించే ప్రసక్తే లేదని బెదిరింపులకు గురి చేస్తున్నారని బాధితులు ఆరోపించారు. మండలంలో లబ్ధి పొందిన దళిత కుటుంబాల నుంచి లక్షన్నర లేదంటే మూడు లక్షల వరకు లంచం తీసుకొని డబ్బులు ఇప్పిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు.
ప్రతి గ్రామంలో ఇద్దరు ముగ్గురు గులాబీ నేతలు, ఈ మధ్యవర్తిత్వాన్ని యధాచగా కొనసాగిస్తున్నారు. కోందరు దళారులు ప్రభుత్వ అధికారులకు లబ్ధిదారులకు, మధ్యవర్తిత్వాన్ని వ్యవహరించి లక్షలు దండుకుంటున్నారు. ఎస్సీ కార్పొరేషన్ కొందరు అధికారులు మధ్యవర్తులను పెట్టుకొని దండుకుంటూ మూడు పువ్వులు, ఆరు కాయలు వసూళ్లు చేస్తున్నారు. ఎన్నికలు సమిపిస్తున్న తరుణంలో మిగిలిన దళిత బంధు డబ్బులు లాప్స్ అవుతాయని, వెనువెంటనే డబ్బులు డ్రా చేసుకోవాలని మధ్యవర్తులు దళిత కుటుంబాలకు బెదిరించి తమ వాటా తీసుకొని మిగిలిన డబ్బులు ఇప్పిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.
నిజాంసాగర్ మండలంలో దళితబందు పేరిట వసూళ్ల పై జిల్లా కలెక్టర్ విచారణ చేయాలి : తోట లక్ష్మీకాంతరావు
దళితబంధు పథకంలో అక్రమాలు జరుగుతున్నాయి వెంటనే జిల్లాకలెక్టర్ విచారణ చేపట్టాలని, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయి నాయకుడు తోట లక్ష్మీకాంతరావు డిమాండ్ చేశారు. దళిత బందుకు దరఖాస్తు చేసుకోవడానికి అచ్చంపేట ప్రజాప్రతినిధి 8 లక్షల రూపాయలు లంచం అడగడం సిగ్గుచేటు. అందరికీ న్యాయం చేయవలసిన ప్రజా ప్రతినిధులు, అధికారులు ఈ విధంగా వ్యవహరించడం దౌర్భాగ్యం అని ఆయన అన్నారు. ఇలాంటి బ్రోకర్లపై, జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే, కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.