సిద్దుల గుట్టపై ప్రత్యేక పూజలు
ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని ప్రఖ్యాతిగాంచిన నవనాథ సిద్దుల గుట్టపై కార్తీక పౌర్ణమి సోమవారం భక్తుల రద్దీతో కిటకిటలాడింది.
దిశ,ఆలూర్: ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని ప్రఖ్యాతిగాంచిన నవనాథ సిద్దుల గుట్టపై కార్తీక పౌర్ణమి సోమవారం భక్తుల రద్దీతో కిటకిటలాడింది. హనుమాన్, దుర్గామాత ఆలయాల్లో, భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు శివాలయంలో,అయ్యప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామివారికి నందీశ్వర మహారాజ్ ఆధ్వర్యంలో..అశేష భక్తజన సమక్షంలో పల్లకి సేవ, భజన కార్యక్రమాలు, నృత్యాలు నిర్వహించారు. భక్తులకు అన్నప్రసాదాలను వితరణ చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ..సిద్దుల గుట్టపై సప్త హారతి, గిరి రథోత్సవం కార్యక్రమం నిర్వహిస్తున్నామని, భక్తులు మంగళ హారతితో గిరి ప్రదక్షిణలో పాల్గొనాలన్నారు. అదేవిధంగా భక్తుల సౌకర్యార్థం కాటేజ్ రూంలు ఏర్పాటు చేశామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు భారత్ గ్యాస్ సుమన్, పీ సీ గంగారెడ్డి, కొడిగెల మల్లయ్య, ప్రశాంత్ గౌడ్, జిమ్మీ సంధ్యా రవి, కొంతం మంజుల మురళి,పూజారిసతీష్ , ప్రొద్దుటూరి చరణ్ రెడ్డి, అలిశెట్టి నరేష్, బోండ్ల ఆనంద్, సిద్దులు గుట్ట సేవ సమతి, భజన మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.