ఎక్కడున్నావు అమ్మ.. తల్లి జాడ కోసం ఆడబిడ్డల ఎదురుచూపులు..

మా ఆలనా పాలన చూస్తుందనుకున్న ఆ తల్లి హైదరాబాద్ లో తప్పిపోయి 20 రోజులు అవుతున్నా ఆచూకీ లభించకపోవడంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో తీరని వేదనను అనుభవిస్తున్నారు.

Update: 2024-11-26 04:52 GMT

దిశ, తాడ్వాయి : మా ఆలనా పాలన చూస్తుందనుకున్న ఆ తల్లి హైదరాబాద్ లో తప్పిపోయి 20 రోజులు అవుతున్నా ఆచూకీ లభించకపోవడంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో తీరని వేదనను అనుభవిస్తున్నారు. అమ్మ జాడ దొరుకుతుందనే నమ్మకంతో ఎదురు చూస్తున్న ఆ ఆడపిల్లల దీన గాద. వివరలలోకి వెళ్తే కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం సంతాయిపేట్ గ్రామానికి చెందిన హిమాంబి (గాయిత్రి) (35) ముగ్గురు ఆడ బిడ్డలకు జన్మనిచ్చింది. రోజు కూలి పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తుంటారు. ఆడపిల్లలు చిన్న వయసులో ఉండగానే దురదృష్టవశాత్తు భర్త పాముకాటుకు గురై చనిపోవడంతో కుటుంబ భారాన్ని ఆ తల్లి భుజాన వేసుకొని జీవనం కొనసాగిస్తుంది.

అయితే హిమాంబి తల్లికి క్యాన్సర్ వ్యాధితో బాధపడితుంటే హైదరాబాదులోని ఓ క్యాన్సర్ అస్పత్రికి చికిత్స కొరకు కుటుంసభ్యులతో కలిసి తీసుకెళ్లారు. అక్కడి వరకు బాగానే ఉన్న ఇంటి దగ్గర పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారని తిరిగు ప్రయాణం అయిన హిమంది స్వగ్రామానికి రాకపోవడంతో కుటుంబసభ్యులు ఆ హాస్పిటల్ పరిసర ప్రాంతాల్లో బంధుమిత్రులను ఆరా తీసిన ఎంత వెతికిన అ తల్లి కనిపించకపోవడతో సంబంధిత పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు నమోదు చేశామన్నారు. కానీ ఇప్పటివరకు హిమాంబి ఆచూకీ లభించలేదని తెలిపారు. అమ్మ నువ్వు ఎక్కడున్నావు అమ్మ అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. మా అమ్మ ఎవరికైనా కనిపిస్తే 703647957, 6304951655 నంబర్లకు సమాచారం ఇవ్వాలని పుట్టెడు దుఃఖంతో ఆడపిల్లలు ప్రాధేయపడుతున్నారు.


Similar News