పది రూపాయల నాణెం..వద్దు అనొద్దు
మార్కెట్ లో పది రూపాయల నాణేలు చెల్లుతాయని యూనియన్ బ్యాంక్ మేనేజర్ సాగర్ షిండే స్పష్టం చేశారు.
దిశ ,నాగిరెడ్డిపేట్ : మార్కెట్ లో పది రూపాయల నాణేలు చెల్లుతాయని యూనియన్ బ్యాంక్ మేనేజర్ సాగర్ షిండే స్పష్టం చేశారు. పది రూపాయల నాణెం చెల్లదనే అపోహ ప్రజల్లో చాలా బలంగా ఉందన్నారు. వాస్తవానికి ఇది ఎలా మొదలైందో తెలియదుగానీ, పది రూపాయల నాణెం చెల్లదనే వాదన జనాల్లో బలంగా నాటుకుపోయిందన్నారు. కూరగాయల వ్యాపారులు, చిన్నచిన్న హోటళ్లు, కిరాణా, బడ్డీ కొట్ల వర్తకులను..పది రూపాయల నాణెం చెల్లదనే అపోహ అనుమానాలు పెట్టుకోవద్దని సూచించారు. ప్రజల్లో 10 రూపాయల నాణెం చెల్లదన్న అపోహ తొలగించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పది రూపాయల నాణేలు చెల్లుతాయని ఆదేశాలు జారీ చేసిందన్నారు. పది రూపాయల నాణేలు చెల్లుతాయని ప్రజలకు,వ్యాపారులకు అవగాహన కల్పించేందుకు ఆర్బిఐ జారీ చేసిన స్టిక్కర్లను మండల కేంద్రంలోని అన్ని వాణిజ్య,వ్యాపార, కిరాణా, హోటల్లు ఇతర దుకాణాల వద్ద గోడలపై అతికించి పది రూపాయల నాణేలు ప్రజల వద్ద నుంచి తీసుకోవాలని సూచిస్తూ అవగాహన కల్పిస్తున్నామన్నారు. పది రూపాయల నాణేలు చెల్లవని చెబుతూ.. ప్రజల వద్ద నుంచి నాణేలు తీసుకొని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యూనియన్ బ్యాంక్ నాగిరెడ్డిపేట బ్రాంచ్ అసిస్టెంట్ మేనేజర్ సందీప్ సోమవారం మండల కేంద్రంలోని అన్ని వ్యాపార దుకాణాల వద్ద గోడలపై స్టిక్కర్లను సిబ్బందితో అతికింపజేశారు. పది రూపాయల నాణ్యాలు చట్టబద్ధమైనవని వీటిని ప్రజలు,వ్యాపారులు రోజు వారి లావాదేవీలకు ఉపయోగించవచ్చని మేనేజర్ సాగర్ షిండే తెలిపారు.