Sudden Inspections : మున్సిపల్ కమిషనర్ ఆకస్మిక తనిఖీలు

నిజామాబాద్ నగరంలోని డివిజన్ లో మున్సిపల్ కమిషనర్ మంద మకరంద్ శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

Update: 2024-08-16 11:23 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ నగరంలోని డివిజన్ లో మున్సిపల్ కమిషనర్ మంద మకరంద్ శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. 13 వ డివిజన్ లోని సర్వే నెంబర్ 19 లోని లేఅవుట్ ను టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సత్యనారాయణ, ఇతర అధికారులతో కలిసి కమిషనర్ లే అవుట్ ను విజిట్ చేశారు. దాని వివరాలు కనుక్కున్నారు. అనంతరం రెండో డివిజన్ లోని కస్తూర్బా విద్యాలయ సముదాయాన్ని కమిషనర్ సందర్శించారు.

అక్కడి స్కూల్ లో విద్యార్థులకు అందుతున్న భోజన వసతులు, శుభ్రత, పారిశుధ్యం ఇతర విషయాలను కమిషనర్ పరిశీలించారు. అక్కడి పరిస్థితులను గమనించిన ఆయన నగరపాలక సంస్థ అధికారులకు, విద్యా శాఖల అధికారులకు, విద్యా సముదాయాల అధికారులకు తగిన సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. 1500 విద్యార్థినులు చదువుతున్న విద్యాలయాల సముదాయంలో సమస్యల పరిష్కారంపై జాప్యం తగదని కమిషనర్ అధికారులతో అన్నారు. స్కూల్ బిల్డింగ్ నుండి మురుగునీరు అవుట్ లెట్ సమస్య చాలాకాలంగా పెండింగులో ఉందని అక్కడి సిబ్బంది కమిషనర్ దృష్టికి తీసుకురాగా సమస్యను వెంటనే పరిష్కరించాలని మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.


Similar News