రోడ్లు,వంతెనల నిర్మాణానికి నిధులు మంజూరు

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలో 46 కోట్ల 50 లక్షల రూపాయలతో రోడ్లు,వంతెనల నిర్మాణానికి రోడ్లు & భవనాలు & సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి నిధులు మంజూరు చేశారు.

Update: 2024-11-29 15:41 GMT

దిశ ,ఆర్మూర్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలో 46 కోట్ల 50 లక్షల రూపాయలతో రోడ్లు,వంతెనల నిర్మాణానికి రోడ్లు & భవనాలు & సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి నిధులు మంజూరు చేశారు. శుక్రవారం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి వినతి పత్రాన్ని అందజేశారు. రాష్ట్రమంత్రికి వినతి పత్రం ఇచ్చిన వెంటనే రోడ్ల,వంతెనల నిర్మాణానికి, రోడ్ల మరమ్మత్తులకు ఆమోదం తెలిపారు. ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని R&B డిపార్ట్‌మెంట్‌కు చెందిన డబుల్ రోడ్ల విస్తరణ,వంతెన పునర్నిర్మాణం- పనుల మంజూరు కోసం మంత్రిని వినయ్ కుమార్ రెడ్డి అభ్యర్థించారు. ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని (R&B) డిపార్ట్‌మెంట్ సింగిల్‌లేన్ రోడ్‌లు విపరీతమైన రద్దీగా ఉండటం,దెబ్బతిన్న రహదారి వలన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మంత్రికి వివరించారు. ఆర్మూర్ మండలంలోని మంథని రహదారి మీదుగా పిప్రి నుంచి దేగాం వరకు రోడ్డు వెడల్పు సుమారు 9.5 కిలోమీటర్ల కోసం 16 కోట్ల రూపాయలు, ఆర్మూర్ మండలం రాంపూర్, మిర్దాపల్లి రహదారి మీదుగా దేగాం వరకు సుమారు 7.2 కిలోమీటర్ ల రోడ్డు కోసం14కోట్ల రూపాయలు,నందిపేట్ -జన్నేపల్లి ప్రధాన రహదారి తల్వేద వరకు సుమారు 3.4 కిలోమీటర్ల రోడ్డు కోసం 7 కోట్ల రూపాయలు అవసరం ఉన్నట్లు వివరించారు.

ఆర్మూర్ మండలంలోని రాంపూర్, మిర్ధపల్లి రోడ్డు మీదుగా దేగాం మధ్యలో మైనర్ వంతెన పునర్నిర్మాణం కోసం సుమారు 3.5 కోట్ల రూపాయలు, పిప్రి నుంచి దేగాం మధ్యలో మైనర్ వంతెన పునర్నిర్మాణం కోసం సుమారు 3.5 కోట్ల రూపాయలు,పిప్రి నుంచి ఖానాపూర్ మధ్యలో మైనర్ వంతెన పునర్నిర్మాణం కోసం సుమారు 2.5 కోట్ల రూపాయలు నిధులు త్వరితగతిన మంజూరు చేయించి పనులను ప్రారంభించేలా చూడాలని మంత్రిని వినయ్ రెడ్డి కోరారు. కాంగ్రెస్ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ వినయ్ రెడ్డి రాష్ట్ర మంత్రిని కోరగానే ఆర్మూర్ నియోజకవర్గానికి సుమారు 46 కోట్ల 50.00 లక్షలు రూపాయల ఎస్టిమేషన్ కాపీని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆమోదించారు. ఆర్మూర్ నియోజకవర్గంలో కోరిన రోడ్లకు, వంతెనల నిర్మాణాలకు, పలు రోడ్ల మరమ్మత్తులకు ఆమోదం తెలిపిన మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డికి ఆర్మూర్ నియోజకవర్గం ప్రజల తరపున ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.


Similar News