ప్రవేశ పరీక్షల సంసిద్ధత కోసం గణిత ప్రతిభ పరీక్షలు

ప్రవేశ పరీక్షల సంసిద్ధత కోసమే ప్రతిభ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలంగాణ గణిత ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు తాడ్వాయి శ్రీనివాస్ తెలిపారు

Update: 2024-11-29 16:27 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ నవంబర్ 29: ప్రవేశ పరీక్షల సంసిద్ధత కోసమే ప్రతిభ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలంగాణ గణిత ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు తాడ్వాయి శ్రీనివాస్ తెలిపారు. పోటీ ప్రపంచంలో పరీక్షల ప్రాధాన్యత, సంసిద్ధత అవసరాన్ని పెంపొందించి విద్యార్థులను ప్రోత్సహించడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. కామారెడ్డిలోని బాలుర జిల్లా పరిషత్ హైస్కూల్ లో శుక్రవారం పదోతరగతి విద్యార్థులకు  మండల స్థాయి ప్రతిభ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా తాడ్వాయి శ్రీనివాస్ మాట్లాడుతూ..గణిత ప్రతిభ పరీక్షల ఉపయోగాల గురించి వివరించారు. ఈ పరీక్షలు నిర్వహణ ద్వారా విద్యార్థుల్లోని గణిత నైపుణ్యాలను గుర్తించి, వారిని మరింత అభివృద్ధి చేసేందుకు సహాయం చేస్తుందన్నారు. పరీక్షల ద్వారా సమయ నిర్వహణ, సమస్యల పరిష్కార నైపుణ్యాలు,సృజనాత్మకతలు అభివృద్ధి చెందుతాయన్నారు. విజేతలకు సర్టిఫికెట్లు పొందడంతో..విద్యార్థుల్లో తమ సామర్థ్యంపై తమకే నమ్మకాన్ని పెంచుతుందని శ్రీనివాస్ అన్నారు. గణిత సూత్రాలను ప్రాక్టీస్ చేయడంతో వారి తరగతులలో విద్యార్థులు మంచి మార్కులు సాధిస్తారన్నారు. మండల స్థాయిలో గణిత ప్రతిభ పరీక్షల్లో విజయం సాధించిన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందించడంతో.. వారి కృషిని గుర్తించి ప్రోత్సహిస్తున్నారని,ఇది విద్యార్థులను మరింత ముందుకు సాగేందుకు ఉత్సాహపరుస్తుందని శ్రీనివాస్ పేర్కొన్నారు. ప్రతిభ పరీక్షలు భవిష్యత్ తరాలను గణితంలోని నిపుణులుగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తాయన్నారు. విజేతలకు ఆయన సర్టిఫికెట్లను ప్రధానం చేశారు.


Similar News