రైస్ మిల్లర్లు బ్యాంకు గ్యారంటీ, అగ్రిమెంట్లు సమర్పించాలి
ప్రస్తుత 2024-25 సంవత్సరం సిఎంఆర్ కోసం రైస్ మిల్లర్లు బ్యాంక్ గ్యారంటీ, అగ్రిమెంట్లు సమర్పించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచించారు.
దిశ, కామారెడ్డి : ప్రస్తుత 2024-25 సంవత్సరం సిఎంఆర్ కోసం రైస్ మిల్లర్లు బ్యాంక్ గ్యారంటీ, అగ్రిమెంట్లు సమర్పించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలోని రైస్ మిల్లుల యజమానులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఈ సంవత్సరం ధాన్యం కేటాయింపులు జరుగుతున్న దృష్ట్యా మిల్లర్లు గ్యారంటీలను, అగ్రిమెంట్లు అందజేయాలని తెలిపారు. గత 2021-22, 2022-23 సంవత్సరాలకు సంబంధించిన పెండింగులో ఉన్న సిఎంఆర్ వెంటనే సరఫరా చేయాలని, లేకుంటే డిఫాల్ట్ అయిన మిల్లులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవిన్యూ) వి.విక్టర్, పౌర సరఫరాల కార్పొరేషన్ జిల్లా మేనేజర్ రాజేందర్, జిల్లా పౌర సరఫరాల అధికారి నరసింహ రావు, రైస్ మిల్లర్లు పాల్గొన్నారు.