వార్షిక పరీక్షల్లో విద్యార్థులు భయాన్ని వీడాలి

విద్యార్థులు భయాన్ని వదిలి కస్టపడి చదవాలని, మంచి మార్కులు సాధించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు.

Update: 2024-03-14 11:40 GMT

దిశ, తాడ్వాయి : విద్యార్థులు భయాన్ని వదిలి కస్టపడి చదవాలని, మంచి మార్కులు సాధించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విజయ స్ఫూర్తి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..వార్షిక పరీక్షల్లో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి మంచి ఉత్తీర్ణత సాధించాలని విద్యార్థులకు సూచించారు.

    ఆర్ట్ క్రాఫ్ట్ వేస్ట్ మెటీరియల్ తో విద్యార్థులు తయారుచేసిన వస్తువులను చూసి కలెక్టర్ అభినందించారు. అనంతరం హెల్పింగ్ బ్రిడ్జ్ ఫర్ ఎడ్యుకేషన్ సంస్థ సహకారంతో పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, పెన్నులు కలెక్టర్ చేతుల మీదుగా విద్యార్థులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో మోహినుద్దీన్,ఎంపీడీఓ సాజిద్ అలీ, ఎంఈఓ రామస్వామి, హెల్పింగ్ బ్రిడ్జ్ సంస్థ ప్రతినిధులు,ఉపాధ్యాయులు,తదితరులు పాల్గొన్నారు. 


Similar News