స్వల్పంగా పెరిగిన ఎస్సారెస్పీ నీటి మట్టం
శ్రీరామ్ సాగర్ ఎగువ ప్రాంతాల నుంచి రిజర్వాయర్లోకి 8500
దిశ,బాల్కొండ : శ్రీరామ్ సాగర్ ఎగువ ప్రాంతాల నుంచి రిజర్వాయర్లోకి 8500 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుందని ఎఈ ఈ కె. రవి తెలిపారు. దీంతో ప్రాజెక్టు నీటిమట్టం స్వల్పంగా పెరుగుతుందన్నారు. కాకతీయ కు 4200, సరస్వతి కాలువలకు 500 క్యూసెక్కుల కాలువలకు లీకేజి ఆవిరి రూపంలో 522 క్యూసెక్కులు పోతుందన్నారు. మిషన్ భగీరథ తాగునీటి కొరకు 231 క్యూసెక్కులు వినియోగిస్తున్నారన్నారు. నీటి విడుదల జరిగిందన్నారు. సీజన్ లో ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల నుంచి రిజర్వాయర్ లోకి 48.441 టీఎంసీల వరద వచ్చి చేరిందన్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091.00అడుగులు 80.00 టీఎంసీలు కాగా ఆదివారం 1081.50 అడుగులు 49.117 టీఎంసీల నీటి నిల్వ ఉందని ఎస్సారెస్పీ అధికారులు తెలిపారు.