శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద..

ఎగువ ప్రాంతాల నుంచి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు రిజర్వాయర్ లోకి 44,268 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతుందని ఎఈఈ వంశీ తెలిపారు.

Update: 2024-09-29 10:51 GMT

దిశ, బాల్కొండ : ఎగువ ప్రాంతాల నుంచి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు రిజర్వాయర్ లోకి 44,268 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతుందని ఎఈఈ వంశీ తెలిపారు. ప్రాజెక్టు అధికారులు 10 వరద గేట్లను ఎత్తి దిగువ గోదావరిలోకి 44,268 క్యూసెక్కుల మిగులు జలాలను విడుదల చేస్తున్నారు. అదేవిధంగా కాకతీయ కాలువకు 6,800, ఎస్కేప్ గేట్ల నుంచి గోదావరిలోకి 1,200, వరద కాలువకు 5,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

ఈ సీజన్ జూన్ 1 తేది నుంచి ఆదివారం వరకు 216 టీఎంసీ వరద వచ్చింది. అదేవిధంగా కాలువలు, గోదావరిలోకి 143 టీఎంసీల మిగులు జలాలను విడుదల చేశామన్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1091.00 అడుగులు 80.5 టీఎంసీలు కాగా బుధవారం సాయంత్రానికి 1091.00 అడుగులు 80.5 టీఎంసీల పూర్తి స్థాయి నీటి నిల్వ ఉందన్నారు.


Similar News