కామారెడ్డి జిల్లా మెపా కమిటీ ఎంపిక
మెపా యూనియన్ కామారెడ్డి జిల్లా కమిటీని ఆదివారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఏకగ్రీవంగా ఎంపిక చేస్తూ.. కమిటీ సభ్యులకు నియామక పత్రాలు అందజేసినట్లు మెపా రాష్ట్ర అధ్యక్షులు కొత్త గట్టు శ్రీనివాస్ ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి పులి దేవేందర్ ముదిరాజ్ తెలిపారు.
దిశ, కామారెడ్డి రూరల్ : మెపా యూనియన్ కామారెడ్డి జిల్లా కమిటీని ఆదివారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఏకగ్రీవంగా ఎంపిక చేస్తూ.. కమిటీ సభ్యులకు నియామక పత్రాలు అందజేసినట్లు మెపా రాష్ట్ర అధ్యక్షులు కొత్త గట్టు శ్రీనివాస్ ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి పులి దేవేందర్ ముదిరాజ్ తెలిపారు. జిల్లా అధ్యక్షులుగా బొక్కల వేణు ముదిరాజ్, ప్రధాన కార్యదర్శిగా ముదాం చిరంజీవి, ఉపాధ్యక్షులుగా దమ్మని సాయిలు ముదిరాజ్, గౌరవ సలహాదారుడిగా పి.భద్రయ్య ముదిరాజ్ లకు నియామకపత్రాలు అందజేశారు.
అనంతరం నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు మాట్లాడుతూ జిల్లాలో ముదిరాజ్ ల అభివృద్ది కోసం, రిజర్వేషన్ సాధన కోసం రాజకీయాలకు అతీతంగా పనిచేస్తామన్నారు. అంతేగాకుండా అన్ని మండలాలు, గ్రామాల్లో పర్యటించి విద్య, ఉద్యోగ సాధికారత కోసం పని చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మెపా రాష్ట్ర నాయకులు అల్లం వేణు మాధవ్, పెండేం మధు సుధన్, ఉడుత మహేందర్, బోనాల రమేష్, సింగారాపు రామకృష్ణ, సుంచూ శేషాద్రి, పులి నవీన్, సుంచు ప్రశాంత్, కుమారస్వామి, రవి, సుధాకర్ , శ్యామ్ సుందర్ తదితరులు పాల్గొన్నారు.