జీజీహెచ్ లో జూడాల ఆందోళన

కోల్‌కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డాక్టర్‌పై ఇటీవల జరిగిన అత్యాచారం, హత్యకు నిరసనగా నిజామాబాద్ లో జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జీజీహెచ్ లో బుధవారం ఆందోళన చేశారు.

Update: 2024-08-14 15:40 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : కోల్‌కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డాక్టర్‌పై ఇటీవల జరిగిన అత్యాచారం, హత్యకు నిరసనగా నిజామాబాద్ లో జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జీజీహెచ్ లో బుధవారం ఆందోళన చేశారు. నిజామాబాద్ జిల్లా జూడా అధ్యక్షుడు డాక్టర్ జితిన్ మాట్లాడుతూ...కోల్‌కతాలోని ఆర్‌జీకర్ మెడికల్ కాలేజీ

    క్యాంపస్‌లో పీజీ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని అత్యాచారం చేసి ఆపైన హత్య చేయడం దారుణం అన్నారు. నిందితుడికి శిక్ష పడే వరకు, తమకు న్యాయం జరిగే వరకు సమ్మెను విరమించబోమని డాక్టర్స్ అసోసియేషన్ తెలిపింది. భద్రత లేని చోట డ్యూటీ చేయడం కూడా ఉండదంటూ నిరసనకారులు ప్లకార్డులను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో జూడా ల అసోసియేషన్ రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. 

Tags:    

Similar News