పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఓటు బ్యాంకు చీల్చడం ఎవరి తరం కాదు

పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఓటు బ్యాంకును చీల్చడం ఎవరి తరం కాదని, పార్లమెంట్ ఎన్నికల్లో పక్కాగా బీజేపీదే విజయమని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ అన్నారు.

Update: 2024-03-14 14:23 GMT

దిశ, ఆర్మూర్ : పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఓటు బ్యాంకును చీల్చడం ఎవరి తరం కాదని, పార్లమెంట్ ఎన్నికల్లో పక్కాగా బీజేపీదే విజయమని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ అన్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో గల ఓ ఫంక్షన్ హాల్ లో గురువారం పార్లమెంట్ స్థాయి బీజేపీ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ అరవింద్ మాట్లాడుతూ.. బీజేపీ ఓటు బ్యాంక్ మూడింతలు పెరిగిందని, తమ విజయాన్ని ఆపడం ఎవరికీ సాధ్యం కాదన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎన్ని ప్రయోగాలు చేసినా ఇక్కడ బీజేపీని ఢీ కొట్టి విజయం సాధించ లేరన్నారు.

    నిజామాబాద్ పార్లమెంట్ స్థానంలో అత్యధిక మెజార్టీతో బీజేపీ విజయ ఢంకా మోగించడం ఖాయమన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డును తప్పకుండా ఏర్పాటు చేస్తామని, ఇటీవలే జిల్లాకు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పసుపు బోర్డ్ ఏర్పాటు చేస్తామని ప్రకటించడం జరిగిందన్నారు. జిల్లా పసుపు రైతాంగానికి పసుపు ధరలు పెరగడానికి, 20 వేల పైచిలుకు ధర కావడానికి ప్రధానంగా బీజేపీనే కారణమన్నారు. త్వరలో జగిత్యాలలో మోడీ బహిరంగ సభ విజయవంతం కోసం అధిక సంఖ్యలో కార్యకర్తలు హాజరు కావాలన్నారు. మున్నూరు కాపు కులంలో ఓట్లను చీల్చడం కోసమే బీఆర్ఎస్ మున్నూరు కాపు వ్యక్తి బాజిరెడ్డి గోవర్ధన్ ను అభ్యర్థిగా ప్రకటించినట్లు చెప్పారు.

    ఈ మున్నూరు కాపు ఓట్ల చీల్చే ప్రయోగంలో బీజేపీకి ఎలాంటి నష్టం జరగదని, కేవలం కాంగ్రెస్ పార్టీ ఓట్లనే వారు చీల్చుకుంటారన్నారు. అనంతరం నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ దఫా పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి 400కు పైగా ఎంపీ సీట్లు తప్పకుండా వస్తాయన్నారు. దేశంలో బీజేపీని ఢీకొట్టడం ఎవరితరం కాదన్నారు. ఈ సమావేశంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్త, బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి, ఏలేటి మల్లికార్జున్ రెడ్డి, యెండల లక్ష్మీనారాయణ, పల్లె గంగారెడ్డి, పెద్దోళ్ల గంగారెడ్డి, ఉప్పల శివరాజ్ కుమార్, జీవి నరసింహారెడ్డి, కలిగోట గంగాధర్, జెస్సు అనిల్ కుమార్, ఆకుల శ్రీనివాస్, ద్యాగ ఉదయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు. 


Similar News