అన్నదాతలను నట్టేట ముంచిన నాసిరకం విత్తనాలు

నాసిరకం విత్తనాలతో తమని నట్టేట్లో ముంచారంటూ రైతులు గ్రోమోర్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు.

Update: 2024-03-15 09:46 GMT

దిశ, కోటగిరి : నాసిరకం విత్తనాలతో తమని నట్టేట్లో ముంచారంటూ రైతులు గ్రోమోర్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. రైతులు తెలిపిన ప్రకారం కోటగిరి మండల కేంద్రంలోని మన గ్రోమోర్ సెంటర్ నుండి గంగాకావేరి వరి సీడ్ అని చెప్పి సోనా 25 అనే రకానికి చెందిన విత్తనాలను 150 ఎకరాల్లో రైతులకు అంటగట్టారని వాపోయారు.

     మరో 15 రోజుల్లో చేతికి రావాల్సిన పంట ఇప్పటివరకు కూడా పొట్ట దశకు రాలేదని, దాంతో 15 రోజుల క్రితం గ్రోమోర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. తమకు న్యాయం చేయాలంటూ గ్రోమోర్ కార్యాలయానికి వచ్చి అడుగగా పొంతన లేని సమాధానం చెప్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస్ కు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకుండా పోయిందని తెలిపారు. వెంటనే తమకు న్యాయం చేయాలని రైతులు పేర్కొన్నారు.  


Similar News